బిజినెస్

ఎల్‌పీజీ వినియోగంలో పేద మహిళల ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: వంటగ్యాస్ (ఎల్‌పీజీ) కనెక్షన్లను ఉచితంగా పొందుతున్న 3.2 కోట్ల మంది మహిళల్లో దాదాపు 60 శాతం మంది ఏటా సగటున నాలుగేసి సిలిండర్లు తీసుకుంటున్నారని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 2016 మే 1న ప్రారంభించిన ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (పిఎంయువై) కింద 3.2 కోట్ల గ్యాస్ కనెక్షన్లను పేద మహిళలకు ఉచితంగా మంజూరు చేశామని చెప్పారు. 5 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా, మూడేళ్ల కాలవ్యవధిలోనే సగానికి పైగా లక్ష్యాన్ని సాధించామన్నారు. ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందిన వారిలో సుమారు 60 శాతం మంది లబ్ధిదారులు నాలుగేసి సిలిండర్ల చొప్పున తీసుకుంటున్నారని వివరించారు. ఉచితంగా కనెక్షన్లు పొందిన పేద మహిళలు సిలిండర్లు తీసుకోవడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. కాగా, కొండకోనల్లో నివసించే గిరిజనులు ఇంకా వంట చెరకును వినియోగిస్తున్నందున ఆ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల వినియోగం చాలా తక్కువగా ఉందన్నారు. ‘ఉమెన్ ఇన్ ఎల్‌పీజీ’ చాప్టర్‌ను మంగళవారం ఇక్కడ ప్రారంభించిన సందర్భంగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, పది కోట్ల మందికి వంట గ్యాస్ అందించడమే ‘పిఎంయూవై’ పథకం ధ్యేయమన్నారు. వంటచెరకు, బొగ్గు, పిడకలను వాడుతున్నందున వాతావరణం కలుషితం కావడమే గాక, మహిళలు, పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, పరిశుభ్రమైన వంట ఇంధనాన్ని అందించేందుకు ‘పిఎంయువై’ దోహదం చేస్తుందన్నారు. అపరిశుభ్రమైన ఇంధనాన్ని వంట చేసేందుకు వాడుతున్నందున మహిళలు రోగాలను ఎదుర్కొంటున్నారని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ హెచ్చరించిందని ఆయన గుర్తుచేశారు. ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకానికి 8వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించిందని, గత మూడేళ్లలో వంటగ్యాస్ వినియోగించే కుటుంబాల సంఖ్య 21.4 కోట్లకు చేరిందన్నారు. రాబోయే నాలుగేళ్లలో దేశంలో అన్ని కుటుంబాలూ ఎల్‌పిజి వినియోగించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. బాట్లింగ్ ప్లాంట్లను, డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యను గణనీయంగా పెంచామని, రాబోయే రెండేళ్లలో 25 కోట్ల మేరకు గ్యాస్ వినియోగదార్లను పెంచుతామని తెలిపారు. ఎల్‌పిజి పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. డిమాండ్‌కు తగ్గట్టుగా వంటగ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని వివరించారు.