బిజినెస్

దక్షిణ మధ్య రైల్వే, ఐఎస్‌బి మధ్య అవగాహన ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: పరిశోధనలు, పనితీరు, సామర్ధ్యం మెరుగుపరుచుకోవడంపై దక్షిణ మధ్య రైల్వే, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థలు మంగళవారం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ అవగాహన పత్రంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్, బిజినెస్ స్కూల్ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ రైల్ నిలయంలో జరిగిన కార్యక్రమంలో సంతకాలు చేశారు. నాయకత్వం, వ్యూహాత్మక నిర్వహణ, సంప్రదింపుల నైపుణ్యం, మార్పు నిర్వహణ మొదలైన రైల్వే అధికారులకు క్లిష్టతరమైన విషయాల్లో బిజినెస్ స్కూల్ బోధకుల ఉపన్యాసాలను అవగాహనా ఒప్పందం కింద ఏర్పాటు చేస్తారు. నిర్వహణ పనితీరు, వ్యూహాత్మక నిర్వహణ, వౌలిక సదుపాయాల ప్రాజెక్టు మేనేజిమెంట్, వినియోగదారులతో సంబంధాలు, కార్య నిర్వహణ, రెవెన్యూ మేనేజిమెంట్, నూతన ఆవిష్కరణలు వంటి అనేక విషయాల్లో విషయ పరిజ్ఞానంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులకు శిక్షణ ఇస్తారు. రైల్వే సంస్ధ నైపుణ్యం, సేవలపై ప్రభావం చూపే వినియోగదారుల సంతృప్తి, కార్యనిర్వహణ సామర్థ్యంలో రెండు సంస్ధలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఐఎస్‌బి ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ మాట్లాడుతూ పరిశోధన, కార్యనిర్వహణ సామర్ధ్యం రంగాల్లో కలిసి పనిచేస్తామన్నారు.