బిజినెస్

కీలక రేట్లు యథాతథం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 5: తాజా పరిణామాల నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ ఏమాత్రం తగ్గించే అవకాశం కనిపించడం లేదు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సారథ్యంలో రెండురోజులపాటు జరిగే ద్రవ్య విధాన కమిటీ సమావేశం మంగళవారం ఇక్కడ మొదలైంది. అయితే నిపుణుల అంచనాల ప్రకారం ఆర్థిక, విత్తపరమైన అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నప్పటికీ వడ్డీ రేట్లను మాత్రం తగ్గించే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని ఏవిధంగా నియంత్రించాలన్న దానిపైనే ఈ సమావేశంలో భారత సెంట్రల్ బ్యాంక్ ప్రధానంగా దృష్టిపెట్టే అవకాశముందని స్పష్టమవుతోంది. ఈ చర్చల అనంతరం రేపు ఆర్బీఐ తీసుకోబోయే నిర్ణయం ఏవిధంగా ఉంటుందన్న దానిపై ఇటు పారిశ్రామిక రంగంలోనూ, అటు స్టాక్ మార్కెట్‌లోనూ ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్‌లో జరిగిన విధాన సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఆర్బీఐ కొనసాగించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఆ నిర్ణయానికి ద్రవ్యోల్బణమే ప్రధాన కారణమైంది. అయితే వృద్ధి అంచనాలు మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినంతవరకు 6.7 శాతానికి కుదించింది. అలాగే లెండింగ్ రేటును కూడా 0.25 శాతాన్ని తగ్గించి 6 శాతానికి కుదించింది. గత ఆరు సంవత్సరాల్లో ఈ రేటు ఈ స్థాయిలో ఉండటం ఇదే మొదటిసారి. కాగా, నేటి సమావేశంలో కూడా రెపో రేటు లేదా స్వల్పకాలిక లెండింగ్ రేటును ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని, ముఖ్యంగా రానున్న కొన్ని నెలల్లో ద్రవ్యోల్బణం పెరిగే సంకేతాలు బలంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం కావచ్చునని నిపుణులు స్పష్టం చేశారు. 3ఏవిధంగా చూసినా యథాతథ స్థితే కొనసాగుతుంది. వ్యవస్థలో ద్రవ్య లభ్యత కూడా తక్కువగానే ఉంది. డిపాజిట్లు క్రమంగా బలపడుతున్నాయి. దీనితోపాటు ద్రవ్యోల్బణ బూచి కూడా పొంచివుంది2 అని యూనియన్ బ్యాంక్ ఎండి రాజ్‌కిరణ్ పేర్కొన్నారు. రానున్న కాలంలో ద్రవ్యోల్బణం మరింతగా బలపడే అవకాశముందని, క్రెడిట్ రేటింగ్ సంస్థ ఐసిఆర్‌ఏ కూడా ఇప్పటికే స్పష్టం చేసింది.

పేలవంగా మార్కెట్
ఆర్బీఐ నిర్ణయంపైనే ఉత్కంఠ
మరికొన్ని గంటల్లో ఆర్బీఐ తాజా విధాన ప్రకటన వెలువడనున్న దృష్ట్యా మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ లావాదేవీలు మందకొడిగానే సాగాయి. ఆర్బీఐ నిర్ణయం విషయంలో భిన్న సంకేతాలు వ్యక్తీకృతం కావడంతో ఇనె్వస్టర్లు దూకుడును తగ్గించారు. మరోపక్క స్థూల ఆర్థిక సంకేతాలు కూడా నిస్తేజంగా ఉండటం ఇనె్వస్టర్లు అంత ఉత్సహాన్ని కనబరచకపోవడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని తాజా పరిణామాలను ప్రతిబింబిస్తూ సెనె్సక్స్ వివిధ దశల్లో ఊగిసలాడి 67.28 పాయింట్లు కోల్పోయి 32,802.44 వద్ద ముగిసింది. దాదాపు అన్ని కంపెనీల షేర్లు నష్టాలతోనే మొదలైనప్పటికీ చివరి దశలో భారీ కొనుగోళ్లు జరగడం వల్ల నష్టం తగ్గింది. నిఫ్టీ కూడా 9.50 పాయింట్లు కోల్పోయి 10,118.25 వద్ద ముగిసింది. నేటి లావాదేవీల్లో హీరోహోండా, హీరో మోటార్ కార్ షేర్ విలువ అత్యధిక స్థాయిలో 2.31 శాతం నష్టపోయింది. విప్రో షేర్ విలువ కూడా 2.29 మేర నష్టపోయింది. టాటా స్టీల్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ తదితర కంపెనీలు కూడా నష్టాలను చవిచూశాయి. అయితే దీని ప్రభావం నుంచి ఎస్‌బీఐ తప్పించుకుని షేర్ విలువను 1.92 శాతం మేర పెంచుకోగలిగింది. భారతి ఎయిర్‌టెల్ షేర్ విలువ కూడా 1.18 శాతం మేర పెరిగింది.