బిజినెస్

పెట్టుబడుల గమ్యస్థానం ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 6: పెట్టుబడుల విస్తరణకు, ఆంధ్రప్రదేశ్‌ను సరైన స్థానంగా గుర్తించినట్లు కియా సంస్థ ప్రెసిడెంట్ హూన్‌వూ పార్క్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో మూడోరోజు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పాల్గొన్న కియా మోటార్స్, కొరియాలోని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సంయుక్త బిజినెస్ సెమినార్‌లో హూన్ వూ పార్క్ ప్రసంగించారు. భారత మార్కెట్ వాల్యూపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పరిశ్రమకు అనుమతులు త్వరితగతిన పూర్తి చేశారని, ఏడాదిలో చేస్తారని తాము భావిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కేవలం మూడు నెలల్లో తమకు కేటాయించిన భూమిలో అభివృద్ధి పనులు పూర్తిచేసి ఆశ్చర్యంలో ముంచెత్తిందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ ఏర్పాటు తమకు మంచి అనుభవం అని హాన్ వూ పార్క్ అన్నారు. సదస్సుకు స్వాగతం పలికిన భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అన్నారు. పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. కొరియన్ పారిశ్రామిక వేత్తలు ఏపీలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

సౌర విద్యుత్తు ప్లాంట్‌కు ఓసీఐ కంపెనీ ఆసక్తి

మూడోరోజు ముందుగా ముఖ్యమంత్రి ఓసీఐ కంపెనీ సీఈవో వు హ్యూమ్ లీతో సమావేశమయ్యారు. సౌర విద్యుత్తు రంగంలో వివిధ దేశాలలో తమ సంస్థ జరుపుతున్న కార్యకలాపాలు, తమ బలాలు, సామర్థాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ఈ సందర్భంగా ఓసీఐ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కొరియా చిన్న దేశమైనందున వివిధ దేశాలలో తమ విస్తృతిని పెంచుకునేందుకు సంస్థ కృషి చేస్తోందన్నారు. గత ఏడాది విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుకు ఓసీఐకి ప్రాతినిధ్యం వహిస్తూ తాము హాజరయ్యామని సీఈవో హ్యూమ్ లీ గుర్తు చేశారు. అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నిశితంగా పరిశీలిస్తున్నామని హ్యూమ్ లీ తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ సౌర విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఓసిఐ సిఈఓను కోరారు. సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిమూ హియో సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుంగ్ జూన్ కిమ్, టీమ్ మేనేజర్ జే వూక్ బేక్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఓసీఐ సంస్థ అమెరికాలోని టెక్సాస్, న్యూజెర్సీ, జార్జియా రాష్ట్రాలలో, మలేసియాలో సౌర విద్యుత్తు రంగంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
ముందుగా ఏపీలోనే మా పరిశ్రమ: ఎల్‌జీ!
సుప్రసిద్ధ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్‌జీ ప్రెసిడెంట్ సూన్‌క్వోన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ సంస్థ కార్యకలపాలాను బాబుకు ఎల్‌జీ ప్రెసిడెంట్ వివరించారు. ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా సూన్ క్వోన్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకూ తాము తయారీ రంగంలో కొరియా దాటి పూర్తిస్థాయిలో మరే దేశానికి వెళ్లలేదని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇండియాలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీకి ఉన్న అనుకూలతలు ఏమిటని ఎల్‌జీ ప్రెసిడెంట్ సీఎంను అడిగి తెలుసుకున్నారు. దేశంలో వ్యాపార అనుకూలత కలిగిన రాష్ట్రాలలో ఇప్పటికే తాము నెంబర్ వన్‌గా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
మరో కొరియన్ కంపెనీ కియా మోటార్స్ ఏపీలో స్థిరపడిన విధానం, ఫాక్స్‌కాన్ తమిళనాడును వదిలి ఏపీకి వచ్చి 13 వేల మందితో పనిచేస్తున్న వివరాలను ముఖ్యమంత్రి ఎల్‌జీ కంపెనీ సీఈఓ సూన్ క్వోన్ దృష్టికి తెచ్చారు. దేశ సగటు వృద్ధి రేటు కంటే, రెట్టింపు వృద్ధి రేటు సాధిస్తున్నామని చెప్పారు. ఏపీకి విస్తరించే ప్రతిపాదనను తమ బోర్డుతో చర్చిస్తామని సూన్ తెలిపారు. స్టోరేజ్ బ్యాటరీలు, ఎలఅక్టానిక్స్ రంగాలలో పెట్టుబడులకు తమకు ఆసక్తి ఉందని ఆయన చెప్పారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి అక్కడ ఉన్న వ్యాపార అనుకూలతను పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. కాగా ఇంత సాంకేతిక పరిజ్ఞానంతో ఒక ప్రభుత్వాధినేతను చూడటం తనను ఆశ్చర్యపరుస్తోందని ఎల్‌జీ సంస్థ ప్రెసిడెంట్ సూన్ ప్రశంసాపూర్వకంగా అన్నారు.
డార్ల్స్ డైరెక్టర్ బెన్నీ కాంగ్‌తో భేటీ
తర్వాత దక్షిణ కొరియాలోని అతి పెద్ద లాజిస్టిక్ సంస్థ డార్ల్స్ డైరెక్టర్ బెన్నీ కాంగ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న లాజిస్టిక్ యూనివర్శిటీలో భగస్వామి కావాలని ఆయన్ని కోరారు. లాజిస్టిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేయడం అపూర్వం, అందులో భాగస్వామ్యం కావడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నామని బెన్నీ ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి బృందంలో ఆర్థిక మంత్రి యనమల, వాణిజ్యం, పరిశ్రమలు, ఆహారశుద్ధి శాఖల మంత్రి అమరనాథరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్, ఏపీ ఐఐసీ ఎండీ అహ్మద్ బాబు ఉన్నారు.