బిజినెస్

స్పోర్ట్స్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ టాప్-10లో జోహ్రీకి చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రీకి అరుదైన గౌరవం లభించింది. స్పోర్ట్స్‌బిజినెల్ డాట్ కామ్ నిర్వహించిన ఒక సర్వేలో, ఈ ఏడాది అత్యుత్తమ బిజినెన్ ఎగ్జిక్యూటివ్స్ ‘టాప్-10’ జాబితాలో జోహ్రీ నాలుగో స్థానాన్ని సంపాదించాడు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులు ఉన్న బీసీసీఐ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్‌కు కేటాయించడం ద్వారా 340 మిలియన్ డాలర్లు లభించాయి. జోహ్రీ సీఈవోగా ఉన్న సమయంలోనే ఈ వేలం జరిగింది. ఇలావుంటే, స్టార్ ఇండియా అధ్యక్షుడు దాస్‌గుప్తా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. గత ఏడాది కూడా అతను ‘టాప్-10’లో చోటు సంపాదించాడు. ఈ ఏడాది ఇద్దరు భారతీయులకే ఇందులో స్థానం లభించింది.