బిజినెస్

అభివృద్ధి చెందిన దేశంగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒసాకా (జపాన్), జూన్ 2: స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి గణాంకాలు అందజేస్తున్న ప్రోత్సాహంతో ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రపంచంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ పేరును నిలబెట్టడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సంస్కరణల అజెండాను మరింత ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. గురువారం ఆయన జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రానున్న రెండు దశాబ్దాల్లో భారత్ తన పూర్తి శక్తిసామర్ధ్యాలేమిటో తెలుసుకుని ఆర్థికాభివృద్ధిని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, అలా జరిగినప్పుడే మనం ఉన్నత స్థాయి అభివృద్ధిని కొనసాగించగలిగి పేదరిక నిర్మూలనలో సఫలీకృతులం కాగలుగుతామని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి అనుకూల విధానాల వలన గత (2015-16) ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 7.6 శాతం వృద్ధి చెందగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో అది 7.9 శాతానికి పెరిగిందని జైట్లీ తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఖ్యాతి పొందిన భారత్ ఆ పేరును నిలబెట్టుకుంటుందని, అలా చేయగిలిగినప్పుడే మనం ప్రస్తుతం వర్థమాన దేశంగా ఉన్న భారత్‌ను మరింత అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దగలుగుతామని ఆయన అన్నారు.
వరుసగా రెండేళ్లు రుతుపవనాలు మందగించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నప్పటికీ భారత్ అత్యధిక వృద్ధి రేటుతో దూసుకెళ్తోందని, అయినా దేశంలో ఇప్పటికీ అమలు చేయాల్సిన సంస్కరణలు చాలా ఉన్నాయని జైట్లీ ఉద్ఘాటించారు. మున్ముందు కూడా ప్రాపంచిక పరిస్థితులు సానుకూలంగా ఉండకపోవచ్చని, అయితే ఈ ఏడాది దేశంలో రుతుపవన వర్షాలు మెరుగుపడి ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమివ్వగలవని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ‘దేశంలో సంస్కరణల ప్రక్రియ మరింత ముందుకు కొనసాగుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నా. ‘గతంలో మేము చేపట్టిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంపొందించడంతో పాటు పెట్టుబడులు పెట్టేందుకు భారత్ ఎంతో అనుకూలమని దేశ, విదేశీ మదుపరుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు దోహదపడ్డాయి’ అని జైట్లీ అన్నారు.
వచ్చే ఏడాది నుంచి జిఎస్‌టి అమలు
ఇదిలావుంటే, దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమైనదిగా పరిగణిస్తున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) చట్టాన్ని వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకొస్తామని జైట్లీ సూచనప్రాయంగా తెలిపారు. జిఎస్‌టికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ ముందుకు తీసుకురావడంతో పాటు దీని అమలుకు అవసరమై అనుబంధ చట్టాలన్నింటికీ ఈ ఏడాది చివరిలోగా ఆమోదముద్ర వేయిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘జిఎస్‌టి అమలుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును వచ్చే నెలలో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ పరిశీలనకు తీసుకొస్తాం. ఈసారి ఈ బిల్లుకు పెద్దల సభలో ఆమోదం లభిస్తుందని నేను ఆశిస్తున్నా’ అని జైట్లీ అన్నారు. రాజ్యసభలో జిఎస్‌టి బిల్లును ఆమోదించిన తర్వాత దాని అమలు కోసం మరో మూడు అనుబంధ చట్టాలను రూపొందించాల్సి ఉంటుందని, వీటిలో రెండింటిని కేంద్ర ప్రభుత్వం, మరొక దానిని రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాల్సి ఉంటుందని జైట్లీ వివరించారు.

చిత్రం జపాన్‌లోని ఒసాకాలో గురువారం ‘ఇండియా: ఇనె్వస్ట్‌మెంట్ ప్రమోషన్ సెమినార్’లో ప్రసంగిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ