బిజినెస్

తెలంగాణ-ఆస్ట్రేలియా మధ్య వ్యాపార బంధానికి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నార్సింహారెడ్డి పర్యటిస్తున్నారు. విక్టోరియాలోని పారిశ్రామిక దిగ్గజాలు, ప్రవాస భారతీయులతో ఆయన బిజీగా ఉన్నారు. విక్టోరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీఈవో అర్జున్ సూరపనేని, హాన్ క్రేప్గ్ ఒందర్చియే, ఎంపి సాన్ అలాన్ గ్రిఫిన్, ప్రొఫెసర్ రిచర్డ్ కార్టర్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ-ఆస్ట్రేలియాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాల పెంపునకు సహకరించాలని మంత్రి నాయిని కోరారు.
తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో పెట్టుబడుల అవకాశాల గురించి, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సానుకూల పరిస్థితుల గురించి వారికి వివరించారు. తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానమని, ప్రపంచ దేశాల ఇండస్ట్రియల్ పాలసీలను అధ్యయనం చేసి టీఎస్-ఐపాస్‌ని తీసుకొచ్చామని తెలిపారు. టీఎస్-ఐపాస్ ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని తెలిపారు. టీహబ్ టాస్క్ వంటి ప్రభుత్వ సంస్థలు క్వాలిటీ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడంలో ఎంతో తోడ్పడుతున్నాయని ఇనె్వస్టర్లకు వివరించారు. తెలంగాణలో ఉన్న ట్యాలెంట్ నేడు ప్రపంచానికి అవసరమని, తెలంగాణ సీఎం కేసిఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ పట్టుదలతో నేడు తెలంగాణ దేశంలోనే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజెనెస్‌లో, అభివృద్ధిలో కూడా ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆస్ట్రేలియాలోని పలువురు అధికార, అనధికార ప్రముఖులు, ప్రవాస భారతీయులు ఆస్ట్రేలియాకు చేస్తున్న సేవలను, దేశ అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని కొనియాడారు. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి శ్రీనివాస్‌రెడ్డి, మహమ్మద్ ఆజమ్ అలీ, తెలంగాణ బిజెనెస్ కౌన్సిల్ ఫోరణ సభ్యులు నల్లా ప్రవీణ్‌రెడ్డి, కపిల్ కాటెపల్లి, వినయ్ కోల్కాప్పె, ఆనంద్ చుక్క, మిథున్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.