బిజినెస్

వసతులు కల్పిస్తాం.. వచ్చేయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని, కావల్సిన వసతులు కల్పిస్తామని దక్షిణ కొరియాకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. కృష్టపట్నం పోర్టుతో బూసన్ పోర్టు అనుసంధానం, లాజిస్టిక్ వర్సిటీ ఏర్పాటు, కార్గో వ్యాపారానికి ఉన్న అవకాశాలను వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆయన బుధవారం తొలుత కియా మోటార్స్ బిజినెస్ సెమినార్‌లో పాల్గొన్నారు. అక్కడ కృష్ణపట్నం పోర్టు గురించి ప్రస్తావించారు. బూసన్, కృష్ణపట్నం పోర్టులను అనుసంధానం చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ రెండు పోర్టుల మధ్య ప్రయాణ కాలం 19 గంటలని వివరించారు. కాకినాడలో ఏర్పాటు చేయనున్న సెజ్ గురించి జీఎమ్మార్ సంస్థ ప్రజెంటేషన్ ఇచ్చింది.
ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా గ్రీన్ క్రాస్ సెల్ సంస్థ ఎండీ లీ డక్ జూతో సీఎం సమావేశమయ్యారు. ఈ సంస్థ ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు సంబంధించి ఔషధాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. తూర్పు ఆసియా దేశాల్లో వ్యాపారాభివృద్ధికి ఆసక్తి చూపుతున్నట్లు జూ తెలిపారు. కామా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కిమ్ యాంగ్ హ్యూస్‌తో సీఎం సమావేశమయ్యారు. ఏపీలో కియా అడుగుపెట్టిన తరువాత చాలా కొరియన్ ఆటోమొబైల్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని కిమ్ తెలిపారు. తమ ప్రతినిధులను ఏపీకి పంపుతామని తెలిపారు. హూందాయ్ మర్చంట్ మెరైన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ హూ కిమ్, జీఎం డేవిడ్‌లతో సీఎం చర్చలు జరిపారు. ఏపీలో పోర్టుల విస్తరణ, కంటైనర్ బిజినెస్‌కు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. ఎపీలో చాలా డీప్ పోర్టులు ఉన్నాయని, ఇతర పోర్టులతో అనుసంధానం కలిగి ఉన్నాయని వివరించారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు - చెన్నై కారిడార్ అదనపు బలం అవుతుందన్నారు. ఈ కారిడార్ల నుంచి జరిపే ఎగుమతుల ద్వారా కార్గో వ్యాపారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. విమానాశ్రయాలు, రోడ్డు నెట్‌వర్కు, అంతర్గత జలరవాణా, ఎకనమిక్ జోన్లు వంటివి ఈ బిజినెస్‌కు సానుకూల అంశాలన్నారు. దీనిపై స్పందించిన కిమ్ మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టును తమ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టుగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో భారత్‌లో తమ వ్యాపారం 50 శాతం పెరిగిందని, భారత్ మార్కెట్‌పై తమకు సంపూర్ణ అవగాహన ఉందని సీఎంకు వివరించారు.
ఏపీలో లాజిస్టిక్ వర్సీటీ ప్రారంభిస్తున్నామని, అధునిక రవాణా సాధనాలపై పరిశోధనా కోర్సులను ప్రవేశపెడతామని తెలిపారు. యంగ్ ఒన్ సంస్థ చైర్మన్ సన్గ్ కియాక్‌తో సీఎం భేటీ జరిగింది. గతంలో చెన్నై, కొయంబత్తూరులో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించామని, కానీ పరిస్థితులు అనుకూలించక విరమించుకున్నామని కియాక్ తెలిపారు. అన్ని వసతులు కల్పిస్తామని, ఎపీకి రావాలని సీఎం ఆహ్వానించారు. టైక్స్‌టైల్స్, అపెరల్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, విశాఖ భాగస్వామ్య సదస్సుకు వచ్చి, స్వయంగా పరిశీలించాలని కోరారు.