బిజినెస్

పొగాకు రైతుకు పన్ను పోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: సిగరెట్ల వినియోగంపై గత ఆరేళ్ల నుంచి పెంచుకుంటూ వస్తున్న పన్నులు 202 శాతానికి చేరుకోవడంతో దాదాపు రూ.3,300 కోట్ల నష్టాన్ని పొగాకు రైతులు చవిచూశారని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ) పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో పొగాకు పండించే రైతులు, ఆ రంగంపై ఆధారపడిన వేలాది కార్మికులకు జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. సిగరెట్లపై ప్రతి ఏడాది విధించుకుటూ పోతున్న కాంపెన్‌సేషన్ సెస్ రేట్లను ఉపసంహరించుకుని పొగాకు సాగుకు జీవం పోయాలని సమాఖ్య ప్రతినిధులు గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రికి వినతిపత్రం సమర్పించారు. సిగరెట్లపై పన్నులు ఏ ఏడాదికాఏడాది రెట్టింపు చేసుకుంటూ పోవడం వల్ల ఆ ప్రభావం ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా రైతాంగంపై పడిందని అన్నారు. సిగరెట్లపై భారీగా పన్ను విధించడం వల్ల దేశీయ సిగరెట్ల తయారీ తగ్గి, విదేశీ సిగరెట్ల స్మగ్లింగ్ ఊపందుకుందని, ఈ కారణంగా పొగాకు పరిశ్రమకు డిమాండ్ గణనీయంగా తగ్గి రైతాంగం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారని ఆ వినతిపత్రంలో మంత్రికి వివరించారు. వర్జీనియా పొగాకు పండించే రైతాంగం బతుకు వెళ్లదీయడం కష్టం కావడంతో దేశ వ్యాప్తంగా 22 మంది పొగాకు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని వివరించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు జవేర్ గౌడ, ప్రధాన కార్యదర్శి మురళీబాబు మాట్లాడుతూ పెంచిన పన్నులను తక్షణమే వెనక్కితీసుకోవాలని అన్నా రు. తద్వారా అక్రమంగా దిగుమతి అవుతున్న విదేశీ సిగరెట్లకు చెక్ పెట్టి దేశీయ సిగరెట్ల పరిశ్రమను ఆదుకోవడం ద్వారా పొగాకు రైతాంగానికి మేలు చేకూరుతుందని వారు కేంద్ర ఆర్థిక మంత్రిని అభ్యర్థించారు. పొగాకు పరిశ్రమ నిలదొక్కుకుంటే రైతులు, సాగుపై ఆధారపడ్డ కార్మికులు, సిగరెట్ల పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వారు వివరించారు.