బిజినెస్

దేశంలోనే తొలి ఇన్‌స్టెంట్ పీపీఎఫ్ ఖాతా సదుపాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ తొలిసారిగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) ఖాతాను ఇన్‌స్టెంట్‌గా పూర్తిగా ఆన్‌లైన్‌లో పేపర్ రహిత విధానంలో తెరిచేందుకు డిజిటల్ సేవలను గురువారం ఆవిష్కరించింది. ఈ సదుపాయంతో పిపిఎఫ్ ఖాతాను ప్రారంభించేందుకు బ్యాంకు ఖాతాదారులు బ్యాంకును సందర్శించి, భౌతికంగా డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదు. ఏ సమయంలోనైనా పిపిఎఫ్ ఖాతాను బ్యాంకు డిజిటల్ ఛానల్స్ అయినటువంటి ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ వినియోగించడం ద్వారా తెరవవచ్చని తెలిపింది. ఈ ఆవిష్కరణ గురించి ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అనూప్ బాగ్చి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సేవలను అందిస్తున్న తొలి బ్యాంక్‌గా తాము నిలిచామని అన్నారు. అత్యంత వేగంగా పూర్తి డిజిటల్ విధానంలో పిపిఎఫ్ ఖాతాను వినియోగదారులు ప్రారంభించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.
యాక్సలేటర్‌ను ఆవిష్కరించిన ట్యాలీ
దేశంలో ప్రీమియర్ బిజినెస్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ ట్యాలీ సొల్యూషన్స్, ఎస్‌ఎంఈలను సమృద్ధి చేయాలనే తమ దృష్టిని కొనసాగిస్తూనే చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు బిజినెస్ కన్సల్టెన్సీ సేవలను అందించేందుకు వినూత్నమైన ట్యాలీ యాక్సలేటర్‌ను ఆవిష్కరించింది. దేశ వ్యాప్తంగా బిజినెస్ కన్సల్టెన్సీ సేవలను అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ట్యాలీ ఇండియా బిజినెస్ హెడ్ జాయ్‌సీ రే అన్నారు. ఈ కార్యక్రమం కింద ట్యాలీ యాక్సలేటర్‌గా పిలువబడే ట్యాలీ నియమించిన భాగస్వాములు వ్యాపార సలహా సేవలను కొనసాగించడంతో పాటుగా కోచ్, మెంటార్, ట్రైనర్‌గా భాగస్వాములందరికీ వ్యవహరిస్తారని తెలిపారు. దేశ వ్యాప్తంగా చిన్న వ్యాపార సంస్థలకు సైతం సేవలను అందించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీ తత్వం పెంచేందుకు సహాయపడడమే కాకుండా తమ వాణిజ్య పెట్టుబడి అవకాశాలను పొందేందుకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు.
వాటర్ హీటర్ విభాగంలో
ప్రవేశించిన స్టాండర్డ్
హావెల్స్ ఇండియా లిమిటెడ్ ప్రఖ్యాత బ్రాండ్ అయిన స్టాండర్డ్ వాటర్ హీటర్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఎంతో అందంగా డిజైన్ చేయబడిన జో అండ్ జో, అమియో, అమేజరో, లిఫ్ట్ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లలో 1 లీటరు నుంచి 25 లీటర్లు వరకు సామర్ధ్యంతో కంపెనీ ఐదు రకాలను ప్రవేశపెట్టింది. భారత దేశపు వాటర్ హీటర్ మార్కెట్ రూ.1300 కోట్లు నుంచి రూ.1500 కోట్లు ఉండగలదని అంచనా వేసినట్లు తెలిపింది. ఇది 12 శాతం రేటుతో వృద్ధి చెందుతోందని హావెల్స్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అబ్ర బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. ఓవర్‌లోడ్, షార్ట్‌సర్క్యూట్, ఎలక్ట్రిక్ షాక్‌లకు సంబంధించి మెరుగైన రక్షణలను ఇది అందిస్తుందని తెలిపింది. ఈ ఉత్పాదన ఇన్నర్ ట్యాంక్‌పై ఏడేళ్ల వారంటీతో లభిస్తుందని తెలిపారు.