బిజినెస్

పాలమూరుకు ఐటీ సొబగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఐటీ పరిశ్రమలను నెలకొల్పడానికి 18 కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. ఈ కంపెనీల నుంచి సేకరించిన అంగీకార పత్రాలను ఐటీశాఖ మంత్రి కె తారకరామారావుకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ గురువారం అందజేసారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ నగరాల్లో ఐటీ పరిశ్రమలను స్థాపించడానికి ముందుకొచ్చాయి. వీటికంటే హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న మహబూబ్‌నగర్‌లో ఐటీ కంపెనీలు తమ శాఖలను నెలకొల్పడానికి ఆసక్తిగా ఉన్నాయని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. మహబూబ్‌నగర్‌లో ఐటీ కంపెనీలు స్థాపించడానికి ఎన్నరైలతో చర్చించడానికి త్వరలో అమెరికా వెళ్లనున్నట్టు తెలిపారు. వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో ఐటీ పరిశ్రమలను నెలకొల్పడం వల్ల స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనుండటంతో ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కెటిఆర్‌కు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేసారు.

చిత్రం..మహబూబ్‌నగర్‌లో ఐటీ కంపెనీల స్థాపనకు ఆసక్తి కనబర్చిన 18 కంపెనీల
అంగీకార పత్రాలను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు అందజేస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్