బిజినెస్

జూలైలో సహారా ఆస్తుల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 2: చెల్లింపులకు సంబంధించి పీకల్లోతు కష్టాల్లో మునిగిన సహారా గ్రూపునకు చెందిన మొత్తం 10 ఆస్తులను వేలం వేయడానికి హెచ్‌డిఎఫ్‌సి రియల్టీ, ఎస్‌బిఐ క్యాపిటల్ సిద్ధమవుతున్నాయి. సహారా ఆస్తుల వేలం విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సెబిని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబి సహారా గ్రూపు ఆస్తులను ఆన్‌లైన్‌లో వేలం వేసే బాధ్యతను సెబి హెచ్‌డిఎఫ్‌సి రియల్టీ, ఎస్‌బిఐ క్యాప్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. హెచ్‌డిఎఫ్‌సి రియల్టీకి దాదాపు 2,400 కోట్ల రూపాయల విలువైన 31 భూముల వేలం బాధ్యతను అప్పగించగా, ఎస్‌బిఐ క్యాప్‌కు మరో 4,100 కోట్ల విలువైన మరో 30 భూమి ఆస్తులను విక్రయిస్తుంది. కాగా జూలై 4వ తేదీ ఉదయం 11-12 గంటల మధ్య అయిదు భూములను వేలం వేయనున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి రియల్టీ గురువారం ఒక బహిరంగ ప్రకటనలో తెలియజేసింది. వీటి రిజర్వ్ ధర దాదాపు 722 కోట్లు ఉంటుందని కూడా ఆ ప్రకటన తెలిపింది. ఎస్‌బిఐ క్యాప్ కూడా జూలై 7న ఉదయం 10.30-11.30 గంటల మధ్య అయిదు భూములను వేలం వేయనుంది. ఈ భూముల ధర దాదాపు 420 కోట్ల రూపాయలుంటుంది. ఈ ఆస్తులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో ఉన్నాయి. అమ్మబోయే ఈ భూముల్లో వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూములున్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఆస్తులను సర్కిల్ రేట్లలో 90 శాతంకన్నా తక్కువకు విక్రయించడానికి వీల్లేదు.

చిత్రం సహారా గ్రూపు సంస్థల అధినేత సుబ్రతా రాయ్