బిజినెస్

కమాడిటి మార్కెట్‌లోకి మ్యూచువల్ ఫండ్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: మ్యూచువల్ ఫండ్‌లను, పోర్ట్ఫోలియో మేనేజర్లను కమాడిటి డెరివేటివ్స్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలని సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) గురువారం ప్రతిపాదించింది. సెబి సుమారు రెండు సంవత్సరాల క్రితం కమాడిటి డెరివేటివ్స్ మార్కెట్ తన పరిధిలోకి వచ్చినప్పటి నుంచి దాని రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటూనే, దానిని విస్తృతం చేయడానికి కూడా అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ సంవత్సరం మొదట్లో ఈ మార్కెట్‌లో ప్రవేశించేందుకు కొన్ని నిర్దిష్టమైన ప్రత్యామ్నాయ ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్‌లను అనుమతించింది. సెబిలో విలీనం కాకముందు కమాడిటీస్ డెరివేటివ్స్ మార్కెట్‌ను ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ (ఎఫ్‌ఎంసీ) నియంత్రించింది. కమాడిటి డెరివేటివ్స్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రకాల సంస్థాగత ఇనె్వస్టర్లను అనుమతించాలని ఇప్పటికే ఈ మార్కెట్‌లో ప్రవేశించిన సంస్థలు చాలాకాలంగా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సెబి గురువారం కమాడిటి డెరివేటివ్స్ మార్కెట్‌లోకి మ్యూచువల్ ఫండ్‌లు, పోర్ట్ఫోలియో మేనేజర్లను అనుమతించేందుకు సంబంధించిన సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. సంబంధిత పక్షాలన్నీ ఈ నెల చివరి నాటికి ఈ అంశంపై తమ స్పందనలు తెలియచేయాలని సెబి ఆహ్వానించింది. అయితే ఈ ఇనె్వస్టర్లను వ్యవసాయేతర సరుకులతో పాటు వ్యవసాయ సరుకులలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతిస్తారా? లేదా? అనే విషయాన్ని ఈ సంప్రదింపుల పత్రంలో పేర్కొనలేదు. సంస్థాగత ఇనె్వస్టర్లు పాల్గొనకుండానే ఇప్పటి వరకు భారత కమాడిటి డెరివేటివ్స్ మార్కెట్లు నడుస్తున్నాయి. దీంతో ఈ మార్కెట్లు తగినంత విస్తృతం కాలేకపోతున్నాయి. ఈ మార్కెట్లలో తగినంత ద్రవ్య చలామణి కూడా కొరవడింది. ఈ రెండూ ఉన్నప్పుడే సరుకులకు ఎక్కువ ధరలు పలకడానికి కాని ధరలు పడిపోవడానికి కాని వీలుంటుంది.