బిజినెస్

పది శాతం జనాభాకు ఈఎస్‌ఐసీ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశంలోని 461కి పైగా జిల్లాల్లో గల ఎంప్లారుూస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) దేశ జనాభాలో సుమారు పది శాతం మందికి తన సేవలు అందిస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్ తెలిపారు. ‘ఎంప్లారుూస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ) పథకం ప్రస్తుతం 461 జిల్లాల్లో ఉంది. దేశ జనాభాలో సుమారు పది శాతం మందికి తన సేవలు అందిస్తోంది’ అని గంగ్వార్ శుక్రవారం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈఎస్‌ఐసీ తన సేవలు అందించే యంత్రాంగాన్ని మెరుగుపరిచే దిశగా బుధవారం జరిగిన 172వ సమావేశంలో కొన్ని ముఖ్యమయిన నిర్ణయాలు తీసుకుంది. ఈఎస్‌ఐసీ గతంలో కూడా రాష్ట్ర స్థాయిలో తన అనుబంధ కార్పొరేషన్/ సొసైటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాల నుంచి అందిన సూచనల మేరకు కోరుకున్న రాష్ట్రాలలో మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ది ఎంప్లారుూస్ స్టేట్ ఇన్సూరెన్స్ సొసైటి (ఈఎస్‌ఐసీ)ని సవరించాలని కూడా నిర్ణయించింది. రాష్ట్రాలలో ఈఎస్‌ఐసీ డిస్పెన్సరీలను నిర్వహించడంతో పాటు రాష్ట్రాలలో వైద్య పరమైన ప్రయోజనాలు, వైద్య సౌకర్యాల నిర్వహణను, పాలనను చూసే విభాగంగా ఈ సొసైటీ పనిచేస్తుందని పేర్కొంది. ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంతో పాటు మొత్తం ఈఎస్‌ఐ డిస్పెన్సరీలలో మూడో వంతు డిస్పెన్సరీలను ఆరు పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయాలని కూడా ఈఎస్‌ఐసీ గతంలో సూత్రబద్ధంగా నిర్ణయించింది. మూడో వంతు డిస్పెన్సరీల స్థాయి పెంచే ప్రక్రియ దశలవారీగా కొనసాగుతుందని గంగ్వార్ తన ప్రకటనలో పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో 50 పడకల ఆసుపత్రిని, బిహార్‌లోని పాట్నాలో గల బిహ్తా వద్ద వంద పడకల ఆసుపత్రిని నిర్మించాలనే ప్రతిపాదనను కూడా ఈఎస్‌ఐసీ ఆమోదించింది.
ఈఎస్‌ఐ వైద్య కళాశాలలు/ ఈఎస్‌ఐ పీజీఐఎంఎస్‌ఆర్‌లలోని అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలలో సేవలు ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన విధానాన్ని కూడా ఈఎస్‌ఐసీ ఆమోదించినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు.