బిజినెస్

ఎడతెరిపి లేని కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 8: దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) ఎడతెరిపి లేకుండా కొనుగోళ్లు జరపడంతో శుక్రవారం మార్కెట్లు బాగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ- రెండూ కూడా పైకి ఎగబాకాయి.
ధరలు పడిపోయిన విలువయిన షేర్లను చేజిక్కించుకోవడానికి మదుపరులు పూనుకోవడంతో గురువారం పుంజుకున్న ఈ రెండు ప్రధాన సూచీలు, శుక్రవారం వరుసగా రెండో రోజు మరింత పైకి ఎగబాకాయి. ముఖ్యంగా డీఐఐలు ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లను బాగా కొనుగోలు చేయడంతో సెనె్సక్స్ శుక్రవారం 33,000 మార్కును అధిగమించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఎన్నికల సర్వేలు పేర్కొనడంతో పాటు గ్లోబల్ మార్కెట్లలో పురోగమనం దేశీయ మార్కెట్లలో మదుపరులు కొనుగోళ్లు జరపడానికి దోహదపడింది. 30 షేర్లతో కూడిన సెనె్సక్స్ శుక్రవారం ఉదయం 33,034.20 పాయింట్ల వద్ద ప్రారంభమయి, పైకి ఎగబాకుతూ ఇంట్రా-డేలో గరిష్ఠ స్థాయి 33,285.68 పాయింట్లను తాకింది. చివరలో కొంత తగ్గి, మొత్తం మీద 301.09 పాయింట్ల (0.91 శాతం) లాభంతో 33,250.30 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం ఈ సూచీ 352.03 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా శుక్రవారం 98.95 పాయింట్లు (0.97 శాతం) పెరిగి 10,265.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ 10,270.85- 10,195.25 పాయింట్ల మధ్య కదలాడింది.
ఈ వారం మొత్తంగా చూస్తే సెనె్సక్స్ 417.36 పాయింట్లు (1.27 శాతం), నిఫ్టీ 143.85 పాయింట్లు (1.42 శాతం) లాభపడ్డాయి. ఆసియా, ఐరోపా మార్కెట్లలో చాలా వాటిల్లో శుక్రవారం ర్యాలీలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా, గురువారం నాటి లావాదేవీల్లో డీఐఐలు నికరంగా రూ. 926.68 కోట్ల విలువ గల షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 1,075.62 కోట్ల విలువ గల షేర్లను విక్రయించారు.
శుక్రవారం నాటి లావాదేవీల్లో సెనె్సక్స్‌లోని ఐటీసీ అత్యధికంగా లాభపడింది. ఈ కంపెనీ షేర్ ధర 3.44 శాతం పెరిగింది. 2.21 శాతం పెరుగుదలతో టాటా మోటార్స్ రెండో స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర కంపెనీలలో సన్ ఫార్మా, హెచ్‌యూఎల్, సిప్లా, ఓఎన్‌జీసీ, మారుతి సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, టాటా స్టీల్, ఉన్నాయి. ఇవి 2.21 శాతం వరకు లాభపడ్డాయి.