బిజినెస్

రూ. 38.9 లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 8: దేశంలోని అగ్ర స్థానంలో ఉన్న వంద కంపెనీలు కలిసి మార్కెట్ విలువ ప్రకారం గత అయిదేళ్లలో రికార్డు స్థాయిలో రూ. 38.9 లక్షల కోట్ల సంపద సృష్టించాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. టాటా గ్రూపునకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ జాబితాలో వరుసగా అయిదోసారి అగ్ర స్థానం లో నిలిచింది.
2012 నుంచి 2017 వరకు సుమారు రూ. 2.50 లక్షల కోట్ల సంపద సృష్టించడం ద్వారా టీసీఎస్ తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ తన 22వ వార్షిక సంపద సృష్టి అధ్యయనంలో వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ) సేవల దిగ్గజం తరువాత స్థానాన్ని ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆక్రమించింది. ఈ బ్యాంకు అయిదేళ్లలో రూ. 2.31 లక్షల కోట్ల సంపద సృష్టించింది. రూ. 1.89 లక్షల కోట్ల సంపద సృష్టించడం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో స్థానంలో నిలిచింది. రూ. 1.59 లక్షల కోట్ల సంపద సృష్టించిన ఐటీసీ నాలుగో స్థానంలో, రూ. 1.41 లక్షల కోట్ల సంపద సృష్టించడం ద్వారా మారుతి సుజుకి అయిదో స్థానంలో నిలిచాయి.
మొత్తం వంద కంపెనీలు కలిసి 2012 నుంచి 2017 వరకు అయిదేళ్ల కాలంలో 38.9 లక్షల కోట్ల విలువ గల సంపద సృష్టించాయని మోతిలాల్ ఓస్వాల్ వెల్లడించింది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అయిదేళ్ల కాలంలో వంద కంపెనీలు ఇంత భారీగా సంపద సృష్టించలేదని పేర్కొంది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెనె్సక్స్‌లో కంపెనీల వాటాల ధరల ఆధారంగా ఈ సంపదను లెక్కించినట్లు వివరించింది. అజంతా ఫార్మా అత్యంత వేగంగా సంపద సృష్టించిన కంపెనీగా వరుసగా మూడోసారి నిలిచింది. ఈ కంపెనీ షేర్ ధర 2012-17 మధ్య కాలంలో 29 రెట్లు (96) శాతం పెరిగింది.
రంగాల వారీగా చూస్తే, ఈ అయిదేళ్ల కాలంలో రూ. 9.34 లక్షల కోట్ల సంపద సృష్టించడం ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు అగ్ర స్థానంలో నిలిచాయి. క్రితం అధ్యయనంలో తొలి స్థానంలో ఉన్న కన్జ్యూమర్ అండ్ రిటెయిల్ ఇండస్ట్రీని ఈసారి బ్యాంకింగ్ రంగం వెనక్కి నెట్టింది. రూ. 6.9 లక్షల కోట్ల సంపద సృష్టించడం ద్వారా కన్జ్యూమర్ అండ్ రిటెయిల్ ఇండస్ట్రీ ఈసారి రెండో స్థానంలో నిలిచింది. అదే సమయంలో, ఈ అయిదేళ్లలో మళ్లీ మళ్లీ లాభాలు క్షీణించిన కారణంగా రూ. ఆరు లక్షల కోట్ల విలువ గల సంపద నాశనం అయింది. ఇలా సంపదను కోల్పోయిన వాటిలో మెటల్స్/మైనింగ్, ట్రేడింగ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాలు తొలి అయిదు స్థానాలలో ఉన్నాయి.