బిజినెస్

నేటి నుంచి ఆర్టీసిలో కార్గో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 2: ఏపిఎస్ ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో భాగంగా సరకుల పార్శిల్ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రవీంద్రబాబు తెలిపారు. గురువారం నెల్లూరు ప్రధాన బస్టాండ్ ప్రాంగణంలో ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ పార్శిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రయాణికులతో పాటు సరకులను రవాణా చేసేందుకు నెల్లూరు జిల్లాలో 97 సర్వీసులను ప్రత్యేకంగా కేటాయించామన్నారు. ఈ సర్వీసుల్లోని లగేజి కేబిన్లను ఎవరికైనా కాలపరిమితి కాంట్రాక్టుగా కూడా ఇస్తామన్నారు. ఇతర పార్శిళ్లను కూడా చేరవేస్తామని తెలిపారు. తొలుత 3 నెలల పాటు ప్రయోగాత్మకంగా రవాణా సదుపాయాలను పరిశీలిస్తామన్నారు. అనంతరం లోటుపాట్లను పరిశీలించి మరింత పకడ్బందీగా ఆర్టీసీ ద్వారా సరకుల, సామాన్ల రవాణా సదుపాయాన్ని మెరుగుపరుస్తామన్నారు. ఈ 3 నెలల కాలంలో రూ.2 నుంచి 3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన మార్గాల్లో ఉన్న ప్రముఖ బస్‌స్టేషన్ కేంద్రాలకు ఈ పార్శిల్ రవాణా సౌకర్యం కల్పిస్తున్నామనీ, త్వరలోనే అన్ని ప్రాంతాలను కవర్ చేస్తామని స్పష్టం చేశారు.