బిజినెస్

బీఎస్‌ఎన్‌ఎల్ సమ్మెకు సీఐటీయూ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: ఈ నెల 12, 13 తేదీల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌లోని 13 కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు సిఐటియు మద్దతు ప్రకటించింది. బిఎస్‌ఎన్‌ఎల్ సబ్సిడరీ టవర్ కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించాలని, 2017 జనవరి 1 నుంచి 15 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేయాలని, అలవెన్సులు సవరించాలని డిమాండ్ చేస్తూ బిఎస్‌ఎన్‌ఎల్ కార్మిక సంఘాల సమ్మెకు తాము మద్దతు ఇస్తున్నట్లు సిఐటియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చుక్క రాములు, ఎం.సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్‌ను కాపాడుకోవడం కేవలం ఆ సంస్థలోని ఉద్యోగులదే కాదని ప్రతి ఒక్కరిదీ అని అన్నారు.