బిజినెస్

60వేల కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 9: దేశంలోని అతిపెద్ద కంటెయినర్ పోర్ట్ జేఎన్‌పీటీ పక్కన గల జేఎన్‌పీటీ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్)లో రూ. 60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 24 కంపెనీలు ముందుకు వచ్చాయని కేంద్ర షిప్పింగ్, ఓడరేవుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జెఎన్‌పీటీ ఎస్‌ఈజెడ్‌లో ఎగుమతులకు ఉద్దేశించిన వెంచర్లు ఏర్పాటు చేసేందుకు 24 కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని ఆయన వివరించారు. మనీకంట్రోల్, ఫ్రీ ప్రెస్ జర్నల్ నిర్వహించిన ఒక సదస్సులో మంత్రి మాట్లాడుతూ రూ. 60వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసే వెంచర్ల వల్ల 1.25 లక్షల నుంచి 1.50 లక్షల మంది వరకు ఉద్యోగాలు పొందగలుగుతారని వివరించారు. 2014 మేలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే జేఎన్‌పీటీ ఎస్‌ఈజెడ్‌కు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా లక్షన్నర మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీల పేర్లను గడ్కరీ వెల్లడించలేదు. 24 కంపెనీలలోని ఒక కంపెనీ రూ. ఆరు వేల కోట్ల పెట్టుబడులు పెడతానని, 40వేల మందికి ఉపాధి కల్పిస్తానని తన అఫిడవిట్‌లో పేర్కొందని మంత్రి తెలిపారు. తైవాన్‌కు చెందిన తయారీ సంస్థ ఫోక్స్‌కాన్ ఈ ఎస్‌ఈజెడ్‌లో తన వెంచర్‌ను ప్రారంభించేందుకు ఆసక్తి కనబరుస్తోందని, ఈ కంపెనీ మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుందని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి గడ్కరీ ఈ విషయం చెప్పారు. ప్రపంచంలోని అత్యంత గౌరవప్రదమైన కంపెనీలలో ఒకటయిన టెస్లా కూడా జేఎన్‌పీటీ ఎస్‌ఈజెడ్‌లో పెట్టుబడులు పెడుతుందని ప్రభుత్వం విశ్వాసంతో ఉండింది. అయితే బ్యాటరీ, ట్రాన్స్‌పోర్ట్ దిగ్గజమైన టెస్లా ఈ ఎస్‌ఈజెడ్‌లో తన వెంచర్‌ను ప్రారంభించేందుకు ఆసక్తి కనపరచడం లేదని గడ్కరీ ఇటీవల చెప్పారు.