బిజినెస్

పిట్టల్లా రాలుతున్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగాపూర్, డిసెంబర్ 10: ఒక రైతుకు వరి శిక్ష ! మరో రైతు నెత్తిన పత్తి కత్తి! చేదు గా చెరకు ! ఇంకో రైతుకు నిలువెల్లా కూర‘గాయాలు’! ఏ రైతును చూసినా కష్టమే.. సాగు నష్టమే..పొలాలన్నీ హలాలతో దునే్న రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు.. ప్రాణాలను పొలానికే అర్పిస్తున్నారు. ఇది ఒక్క ఏడాది కథ కాదు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యథ. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భరోసా ఇవ్వడం లేదు. ఎరువు బరువై.. కూలీలు కరువై .. నీరు కన్నీరై..విత్తు దశ నుంచే చిత్తు చితె్తై అన్నదాతలు నిట్టూర్పు వదులుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడులు కనికరించని ప్రకృతి వైపరీత్యాలు రైతులను జంటకోరల పాములా కాటేస్తున్నాయి. కడివెడు దాహానికి చుక్క నీరు పోసినట్లుగా బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు అందించే రుణాలు రైతుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులు 30,180 హెక్టార్లలో వరిని సాగు చేసారు. 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశా రు. రైతు చేతికి ఫలసాయం అందుతున్న చివరి దశలో ఒక్కసారిగా సుడిదోమ వరి పొలాన్ని ఆశించింది. దీంతో 28,715 ఎకరాల్లో వరి పం టకు నష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 30,342 మంది రైతుల పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేసారు. సగటున ఒక్కో ఎకరానికి 36 వేల నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 30, 342 రైతులకు 100 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేయగా, అంతకంటే ఎక్కువగానే రైతులు పంట నష్టం చవిచూసినట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాలోని రాయికల్ మండలం కట్కాపూర్‌కు చెందిన సంగని సురేందర్, సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన కలికోట జగ న్, అదే మండలంలోని నాగునూర్ లచ్చక్కపేటకు చెందిన కౌలు మహిళా రైతు లత, కోరుట్ల మండలం గుమ్లాపూర్‌కు చెందిన వనె్నల వెంకటేష్ నిండా 30 ఏళ్లు నిండకుండానే తనువు చాలించడం రైతన్నల దైన్య పరిస్థితికి తార్కాణంగా నిలుస్తోంది. వీరితో పాటు రాయికల్ మండ ల కేంద్రానికి చెందిన పా తూరి రాజిరెడ్డి, మల్యాల మండలంల రాంపూర్‌కు చెందిన చెట్టి లింగారెడ్డి, మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన అదిరెడ్డి పంట నష్టపోయి బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2017-18 ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 16 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, మరో 20 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా, జిల్లా నేర సమాచార విభాగం అధికారులు గత ఖరీఫ్‌లో ఒక్క రైతు మాత్రమే ఆత్మహత్యకు పాల్పడినట్లు రికార్డుల్లో నమోదు చేయగా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఈ యేడాది ఏడు గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు నమోదు చేసుకోగా, ఐదుగురికి నష్టపరిహారం అందించినట్లు పేర్కొంటున్నారు. చాలా మంది రైతులు చనిపోతున్నా వివిధ కారణాలు, నిబంధనల పేరిట రైతు ఆత్మహత్యలుగా గుర్తించక చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించడం లేదు.
ప్రభుత్వ భరోసా లేకనే రైతు ఆత్మహత్యలు - ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
దోమపోటు అశించి పంటలు దెబ్బతిన్న ప్రభుత్వం స్పందించకపోవడంతో భరోసా కోల్పోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మద్దతు ధర లేకపోవడం, బోనస్ ప్రకటించకపోవడం వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితిలో మనోధైర్యం కోల్పోయిన రైతులు బలవన్మరణం పొందారు. ఇప్పటివరకు రైతులకు పంటల బీమా పరిహారం అందలేదు. ప్రభుత్వం చేతగాని తనం వల్లే దేశంలోనే రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉందన్నారు. రైతుల్లో నైతిక స్థైర్యం కల్పించి అదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

చిత్రాలు..పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన మహిళా కౌలు రైతు లత (ఫైల్), జగన్ (ఫైల్) పంటకు నిప్పు పెట్టిన వరి పొలం (ఫైల్)