బిజినెస్

బంగారం బ్లాక్ దందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: హైదరాబాద్ కేంద్రంగా బంగారం బ్లాక్ దందా యదేచ్ఛగా కొనసాగుతోంది. ఎలాంటి బిల్లులు లేకుండా కోట్లాది రూపాయల లావాదేవీలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేసేందుకు అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది కొందరైతే..మరికొందరు షాపుల్లో బిల్లులు లేకుండానే బంగారం క్రయ,విక్రయాలు సాగిస్తున్నారు. అయితే వీటిపై పోలీసులు కానీ..ఆదాయపు పన్నుశాఖ గానీ కేసులు నమోదు చేయడం లేదని విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. ఇటీవల నగరం నడిబొడ్డులో కోటి 26 లక్షల రూపాయలు విలువచేసే బంగారం చోరీ జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా 20 గంటల పాటు ఉన్నారంటే..దీనికి కారణం తెలుసుకోవచ్చు. అంటే ఆ డబ్బు లెక్కలేనిది కావచ్చు. లేదా ఆదాయ పన్ను శాఖ కళ్లు గప్పి వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాల్సిన డబ్బు కావచ్చు. దీన్ని బట్టి నిత్యం కోట్లాది రూపాయలు ఐటీ అధికారుల కళ్లు గప్పి చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా బంగారం పేరిట కొంతమంది కొన్ని వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. పోలీసులు, ఆదాయపన్ను, సేల్స్ టాక్స్ అధికారుల సమక్షంలో జరుగుతోంది. వారి కళ్లకు వ్యాపారులు డబ్బుతో గంతలు కడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలావుండగా పన్ను ఎగ్గొట్టడానికే డబ్బు చోరీ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి వ్యాపారులు సంకోచించి ఉంటారని ఇటీవల పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ఇది ఒక వ్యాపారికి సంబంధించిన అంశమే కావచ్చు. కానీ, బంగారం హోల్‌సేల్ మార్కెట్‌కు ప్రసిద్దిగాంచిన హైదరాబాద్, సికిందరాబాద్‌లో పలువురు వ్యాపారులు నిత్యం ఇలాంటి లావాదేవీలు జరుపుతున్నారడానికి ఇటీవల జరిగిన ఈ ఉదంతమే నిదర్శనం. 25నుంచి 30శాతం గోల్డ్ లీగల్‌గా..అంటే బిల్లులపై కొనుగోలు జరుగుతుండగా, 70నుంచి 75శాతం బంగారం బ్లాక్ మార్కెట్ ద్వారా తరలిపోతున్నట్టు సమాచారం. సికిందరాబాద్, అమీర్‌పేట్, ఆబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్‌లతోపాటు పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్, శాలిబండ, చౌకీ, ఖిల్వత్ ప్రాంతాల్లో లెక్కలు చూపకుండా వ్యాపారం సాగిస్తున్నారని అధికారుల వద్ద స్పష్టమైన లెక్కలున్నట్టు సమాచారం. కేవలం నగరం నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి బ్లాక్‌లో బంగారం కొంటున్నారు. దాడులు జరగకపోవడంలో ఉన్న మతలబు ఏంటో ఐటీ, వాణిజ్య శాఖాధికారులకే తెలియాలి. ఎప్పుడో ఓ సారి సికిందరాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు, ఇలీబన్ బస్టాండ్‌లో వ్యాపారుల నగదు దోపిడీకి గురైనప్పుడే బంగారం విలువ, కరెన్సీ విలువలు బయటపడుతున్నాయే తప్ప..అధికారులు మాత్రం దాడులు చేసి వ్యాపారులను అదుపులోకి తీసుకుని విచారించిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. బాధితులు ఒకరిద్దరు ఎప్పుడో ఫిర్యాదు చేస్తే ఐటీ అధికారలు, గానీ పోలీసులు గానీ రంగంలోకి దిగుతారు. నామమాత్రపు దర్యాప్తుతోనే కేసులు ముగుస్తాయనే విమర్శ సర్వత్రా వినవస్తోంది.