బిజినెస్

‘బాబ్లీ’ గాయానికి ‘కాళేశ్వరం’ పూత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 10: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా భాసిల్లుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెనుముప్పులా పరిణమించిన ‘బాబ్లీ’ బంధనానికి విరుగుడుగా ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిలుస్తుందని ఆయకట్టు రైతులు బలంగా విశ్వసిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్ర స్థాయిలో కాళేశ్వరం పనులను పరిశీలన జరిపి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం, నిరంతరం పనులను పర్యవేక్షణ జరిపేలా చర్యలు చేపట్టడంతో నిర్ణీత గడువులోపే పనులు పూర్త య్యే అవకాశాలున్నాయని ఆశిస్తున్నారు. ఇదే జరిగితే బాబ్లీ వల్ల ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని భావించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ ప్రాణప్రతిష్ట జరిగినట్లవుతుందని భావిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీని అనుసంధానిస్తుండడం వల్ల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ఏడాది పొడవునా పూర్తిస్థాయి జలకళతో తొణికిసలాడుతుందని గట్టి నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రభు త్వం కూడా ఈ విషయమై ఆయకట్టు రైతాంగానికి పూర్తి భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తోంది. వాస్తవంగానే కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీలోకి మళ్లించేందుకు వీలు గా చేపడుతున్న శ్రీరాంసాగర్ ప్రాజె క్టు పునరుజ్జీవ పథకం పనులు సకాలంలో పూర్తయితే శ్రీరాంసాగర్ ప్రధాన కాల్వలతో పాటు ఎల్‌ఎండీ కింద మొత్తంగా 11 లక్షల పైచిలుకు ఎకరాలకు సమృద్ధిగా సాగునీటిని అందుబాటులోకి తెచ్చినట్లవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రధాన ఆధారంగా చేసుకుని మల్లన్నసాగర్ ద్వారా, హల్దివాగు మీదుగా నిజాంసాగర్‌లోకి నీటిని మళ్లించేలా ఇదివరకే ప్రణాళికలు రూపొందించి శరవేగంగా పనులు కొనసాగిస్తున్నారు. అనంతరం నిజాంసాగర్ మిగులు జలాలు గోదావరి ద్వారా ఎస్సారెస్పీలోకి చేరుకుంటాయని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇది దూరభారంగా మారి, పంప్‌హౌస్‌లు, లిఫ్టుల నిర్మాణాలకు అధిక వ్యయం అవుతున్న దరిమిలా, ఎస్సారెస్పీకి నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుండే నీటిని మళ్లించేలా ప్రభుత్వం రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా చేపడుతున్న పనులు రైతుల్లో ఎనలేని ఆశలు రేకెత్తిస్తున్నాయి.
కాళేశ్వరం నుండి ఎల్లంపల్లికి నీటిని తరలించి, అక్కడి నుండి వరద కాల్వ ద్వారా రివర్సబుల్ సిస్టమ్‌ను అనుసరిస్తూ 60 టీఎంసీల మేర నీటిని ఎస్సారెస్పీలోకి తరలించేలా చేపడుతున్న పథకానికి గత ఏప్రిల్‌లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఏడాది కాలంలోనే ఈ పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో నిర్విరామం గా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకోలేకపోయింది. కొద్దోగొప్పో కురిసిన వర్షాలతో వచ్చిన వరదలు కూడా బాబ్లీ వద్దే బందీ అయ్యాయ.

చిత్రం..ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు