బిజినెస్

మళ్లీ రుణంకోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: వీవీఐపీల ప్రయాణాలకు ఉద్దేశించిన రెండు విమానాల ఆధునికీకరణ వ్యయం కోసం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా రూ. 1,600 కోట్ల రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. రెండు బోయింగ్ 777-300 విమానాలు వచ్చే సంవత్సరం జనవరిలో ఎయిరిండియా చేతికి అందనున్నాయని, వీవీఐపీలు ప్రయాణించేందుకు వీలుగా వీటిని ఆధునికీకరించేందుకు సుమారు 180 మిలియన్ డాలర్లు వ్యయం అవుతుందని ఎయిరిండియాకు చెందిన ఒక అధికారిక పత్రం వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న మారక రేటు ప్రకారం ఈ మొత్తం రూ. 1,160 కోట్లకుపైగా అవుతుందని పేర్కొంది. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, ప్రధానమంత్రి ప్రయాణం కోసం మాత్రమే ఈ రెండు విమానాలను ఉపయోగిస్తారు. ఈ రెండు విమానాల ఆధునికీకరణ వ్యయం కోసం 180 మిలియన్ డాలర్ల వరకు బ్రిడ్జ్ రుణం తీసుకోనున్నట్టు ఎయిరిండియా టెండర్ డాక్యుమెంట్‌లో పేర్కొంది. 12 నెలలు లేదా అంతకన్నా తక్కువ కాలానికి ఈ రెండు విమానాల ఆధునికీకరణకు అయ్యే వ్యయానికి తీసుకునే రుణానికి హామీ ఇవ్వడానికి భారత ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందని గత వారం విడుదల చేసిన టెండర్ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. ఈ రెండు విమానాలను రీ-కాన్ఫిగరేషన్ చేయనున్నారు. 2018 జనవరి- ఏప్రిల్ మధ్య కాలంలో ఎయిరిండియా ఈ రుణం మొత్తాన్ని తీసుకుంటుంది. మొదటి విడతలో 135 మిలియన్ డాలర్ల రుణాన్ని 2018 జనవరిలో, మిగతా మొత్తాన్ని ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో మూడు విడతలుగా, ఒక్కో విడతలో 15 మిలియన్ డాలర్ల చొప్పున తీసుకోనున్నట్టు ఆ డాక్యుమెంట్ వివరించింది. ఎయిరిండియాలోని కొంత వాటాను విక్రయించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అవసరమైన ఆధునికీకరణ పనులు పూర్తయిన తరువాత ఈ రెండు విమానాలు కూడా వీవీఐపీలను తీసికెళ్లడానికి ఇప్పటికే ఉన్న విమానాల సమూహంలో చేరిపోతాయని ఎయిరిండియా అధికారి ఒకరు గత నెలలో ప్రకటించారు. ఈ రెండు విమానాల ఆధునికీకరణ కోసం తీసుకునే 180 మిలియన్ డాలర్ల రుణానికి ఎలాంటి కమిట్‌మెంట్ ఫీ చెల్లించబోవడం లేదని ఎయిరిండియా స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిన వెంటనే ఈ రుణాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుందని, అందువల్ల ఈ రుణానికి సంబంధించి చేసే ముందస్తు చెల్లింపులకు కాని, మొత్తం రుణాన్ని ముందుగానే చెల్లించడానికి కాని ఎయిరిండియాకు ఎలాంటి అదనపు వ్యయం ఉండబోదని తెలిపింది.
వీవీఐపీల ప్రయాణానికి ఉద్దేశించిన రెండు విమానాలు సహా మొత్తం మూడు విమానాల కొనుగోలు కోసం 535 మిలియన్ డాలర్ల రుణం కావాలని గత నెలలో ఎయిరిండియా కోరింది. ఆ సమయంలో ఆ రుణం మొత్తం రూ. 3,460 కోట్లకు సమానం. ఎయిరిండియా ఇప్పటికే రూ. 50వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయి ఉంది. తాజాగా తీసుకుంటున్న ఈ రుణాలతో ఆ సంస్థ రుణభారం మరింతగా పెరుగుతుంది.