బిజినెస్

ఆర్థిక వ్యవస్థకు చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వ్యవసాయ రుణాల రద్దు విధానం ఆర్థిక వ్యవస్థకు కాని రుణ సంస్కృతికి కాని మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ వైవీ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రుణాల రద్దు అనేది చివరకు రాజకీయ నిర్ణయమే అవుతుందని, దీర్ఘకాలికంగా చూస్తే ఇది సరయిన నిర్ణయం కాదని ఆయన అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో వ్యవసాయ రుణాలు రద్దు చేయాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వైవీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 3ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్ ఇండియా సమ్మిట్ 20172 సందర్భంగా వైవీ రెడ్డి విడిగా మాట్లాడుతూ దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ కొన్ని రాష్ట్రాలలో లేదా దేశ వ్యాప్తంగా వ్యవసాయ రుణాలను మాఫీ చేశాయని అన్నారు. ఆర్‌బీఐ మరో మాజీ గవర్నర్ సి.రంగరాజన్ కూడా ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవసాయ రుణాలను రద్దు చేసే బదులు ఆ రుణాలు చెల్లించడానికి రైతులకు దీర్ఘకాలం అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. లేదా రైతులు దెబ్బతిన్నారని భావించిన నిర్దిష్టమైన సంవత్సరంలో ఇన్‌స్టాల్‌మెంట్‌ను, వడ్డీని మాఫీ చేయవచ్చునని ఆయన సూచించారు. ఏదైనా సంవత్సరంలో రైతులు దెబ్బతింటే ప్రభుత్వం ఆ సంవత్సరంలో వడ్డీ చెల్లింపులను మాఫీ చేయాలని, రుణాలను రీషెడ్యూల్ చేయాలని, దీనివల్ల రుణాలు తిరిగి చెల్లించడానికి రైతులకు ఎక్కువ కాలం ఉంటుందని రంగరాజన్ తెలిపారు. అయినప్పటికీ రైతులు రుణాలు చెల్లించలేకపోతే చివరి ప్రయత్నంగానే ప్రభుత్వం రుణాల మాఫీ గురించి ఆలోచించాలని ఆయన సూచించారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రుణాల రద్దును ప్రకటించిన నేపథ్యంలో ఇద్దరు ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు చేసిన ఈ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణాలు రద్దు చేస్తుందని హామీ ఇవ్వడం గమనార్హం. 2008లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రూ. 74వేల కోట్ల మేర రైతుల రుణాలను రద్దు చేసింది.

చిత్రాలు.. వైవీ రెడ్డి*రంగరాజన్