బిజినెస్

లాయల్ నుంచి అత్యాధునిక ఎల్‌ఈడి లైట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: విద్యుత్ ఆదాకు ఎంతగానో ఉపయోగపడే అత్యాధునిక ఎల్‌ఈడి లైట్లను దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు లాయల్ ఎల్‌ఈడీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి నిరంజన్ పన్నారి తెలిపారు. సోమవారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సంస్థ సీఈవో మనీష్‌తో కలిసి సంస్థ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్కువ కాలం మన్నిక ఉండే ఎల్‌ఈడీ లైట్లను తమ సంస్థ నుంచి అందిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం విద్యుత్ లైట్ల తయారీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చైనాకు చెందిన వెల్‌కాస్ట్ సంస్థతో తాము ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఈ సంస్థ సాంకేతికత ఆధారంగా దేశీయంగానే విద్యుత్ దీపాలను తయారుచేస్తున్నట్టు చెప్పారు. అతి తక్కువగా విద్యుత్ వినియోగంతో ప్రకాశవంతంగా వెలుగులను విరజిమ్మే లైట్లను తాము రూపొందిస్తున్నామని తెలిపారు. బుధవారం తాజ్‌డెక్కన్‌లో నిర్వహించే కార్యక్రమంలో దేశీయ మార్కెట్‌లోకి వీటిని తీసుకురానున్నట్టు చెప్పారు.

చిత్రం..సంస్థ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న లాయల్ ఇండియా ఎండి నిరంజన్ తదితరులు