బిజినెస్

ఫార్మా కంపెనీల క్లినికల్ ప్రయోగాలపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణలో అమాయక యువతపై ఫార్మా కంపెనీలు సాగిస్తున్న క్లినికల్ ప్రయోగాలపై చర్యలు తీసుకోవాలని టి.టిడిపి నాయకులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ నేతృత్వంలో పలువురు నాయకులు మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రమణ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డిజిపి నుంచి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని కమిషన్ కార్యదర్శి హామీ ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అమాయక యువకులపై ఫార్మా కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఔషధ ప్రయోగాలు చేస్తున్నా, ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైందని విమర్శించారు. అమాయక యువతను క్లినికల్ ట్రయల్స్ వైపు మళ్లిస్తున్న బ్రోకర్ల వ్యవస్థను శిక్షించాలని, ఔషధ ప్రయోగం జరిగిన యువకులను గుర్తించి వారికి తక్షణం ప్రభుత్వమే వైద్య సాయం అందించాలని, బాదిత కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని రమణ డిమాండ్ చేశారు.