బిజినెస్

నైపుణ్యాల అభివృద్ధిలో లక్షమంది యువతకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, డిసెంబర్ 12: వివిధ నైపుణ్యాల్లో ఏటా లక్షమంది యువతకు శిక్షణ ఇవ్వాలని సమాజసేవలో పేరెన్నికగన్న టాటా ట్రస్ట్ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా అయిదేళ్లపాటు ఈ కార్యమ్రం కొనసాగుతుంది. గత ఏడాది ఇరవై వేల మంది యువతీ యువకులకు శిక్షణ ఇచ్చినట్లు ‘టాటా ట్రస్టు’ అధిపతి (ఈశాన్య విభాగం) విశ్వనాథ్ సిన్హా మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాల్లో తమ ట్రస్ట్‌కు చెందిన 12 సంస్థలు పనిచేస్తున్నాయని వివరించారు. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు రాబోయే ఐదేళ్లలో ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తృతం చేస్తామన్నారు. ఏటా లక్షమంది యువతకు శిక్షణ ఇవ్వాలన్నదే తమ ధ్యేయమని, గత ఏడాది శిక్షణ పొందిన ఇరవై వేల మందిలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు వెయ్యిమంది ఉన్నారని తెలిపారు. శిక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారు సొంతంగా వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని సిన్హా తెలిపారు. ఏటా 5వేల సూక్ష్మ, చిన్నతరహా వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయించేలా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ తరహాకు చెందిన 2వేల సంస్థలు దేశవ్యాప్తంగా ఏర్పాటైనట్లు, అస్సాంలో 50 సంస్థలు ఆవిర్భవించాయని అన్నారు. సిక్కిం మినహా అన్ని మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో గ్రామీణ, చిన్న పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు వివిధ రంగాల్లో నైపుణ్యాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. అస్సాంలోని 15 జిల్లాల్లో వ్యవసాయం, విద్య, క్రీడలు, నీరు, పారిశుద్ధ్యం, ఆహారం, పోషకాహారం వంటి అంశాల్లో 30వేల కుటుంబాలు ఉపాధి పొందేలా శిక్షణ ఇచ్చామని టాటా ట్రస్ట్ (అస్సాం) అధిపతి పార్థో పట్వారీ చెప్పారు. ఉద్యానవనాలు, పందుల పెంపకం వంటి అంశాల్లోనూ అవగాహన కల్పించామన్నారు. ఈ పథకాల ద్వారా 2021 నాటికి పదికోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు.