బిజినెస్

మిర్చి ఎగుమతికి ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: మిరప ఎగుమతుల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను మూడు నెలల్లో పరిష్కారిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ రాధా మోహన్ సింగ్ హామీ ఇచ్చారు.
మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు నేతృత్వంలో మిర్చి ఎగుమతిదారుల సంఘం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మిర్చి ఎగుమతుల్లో కేంద్రం విధించిన నిబంధనల వల్ల ఎగుమతిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వచ్చేనెలలో మిరప పంట చేతికి వస్తుందని, ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని కేంద్ర మంత్రికి ఎగుమతిదారులు వివరించారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు విలేఖరులతో మాట్లాడుతూ మిర్చి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని, వచ్చేనెల్లో దేశవ్యాప్తంగా మిర్చి పంట చేతికి వస్తుందని, ఇప్పటికే పెద్దఎత్తున గోడౌన్లలో నిల్వలున్నాయని చెప్పారు. మిర్చి ఎగుమతిదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. మూడు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మాణిక్యాలరావు వెల్లడించారు. అలాగే కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‌తో సమవేశమైనట్టు తెలిపారు. విభజన హామీల ప్రకారం కేంద్రం విద్యాలయాలను, సంస్థలను ఏర్పాటు చేసిందని, అయితే సొంత భవనాల నిర్మాణానికి నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్మాణాలను వచ్చే ఏడాదినాటికి పూర్తయ్యేలా చూడాలని కోరినట్టు తెలిపారు. ఏపీలోని ఎన్‌ఐటీకి పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.

చిత్రం..కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్‌తో మంగళవారం భేటీ అయన ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, మిర్చి ఎగుమతిదారుల సంఘం బృందం