బిజినెస్

అమెరికా ప్రత్యక్ష పెట్టుబడుల్లో చైనాను మించిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ అమెరికా మదుపరులు నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో భారత్ చైనాను అధిగమించేసింది. అమెరికా ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలను బట్టి అమెరికా విదేశీ ఈక్విటీ పెట్టుబడుల్లో భారత్ వాటా 1.8 శాతానికి పెరగ్గా, చైనా వాటా 1.6 శాతమే ఉంది. భారతీయ ఈక్విటీల్లో అమెరికా మదుపరుల ప్రత్యక్ష పెట్టుబడులు 2013 సెప్టెంబర్‌లో 700 కోట్ల డాలర్లు కాగా, అవి 2015 డిసెంబర్ నాటికి 1200 కోట్ల డాలర్లకు పెరిగిపోయాయి. ఇదే సమయంలో చైనా ఈక్విటీల్లో అమెరికా మదుపరుల ప్రత్యక్ష పెట్టుబడులు 2013 సెప్టెంబర్‌లో ఉండిన 1280 కోట్ల డాలర్లనుంచి 2015 డిసెంబర్ నాటికి 1110 కోట్ల డాలర్లకు తగ్గిపోయాయి. అయితే బలమైన ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న దేశాలలో భారత్ ప్రాధాన్యత మాత్రం 2015లో క్రమంగా తగ్గుముఖం పట్టింది. మరో వైపు ఎమర్జింగ్ మార్కెట్లలో అమెరికా మదుపరుల ఈక్విటీ పెట్టుబడులు సైతం 2009 డిసెంబర్‌లో గరిష్ఠంగా 18 శాతం ఉండగా, 2015 డిసెంబర్ నాటికి 12 శాతానికి తగ్గిపోయినట్లు కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ రూపొందించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. మరో వైపు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చురుగ్గా పెట్టుబడులు పెట్టే ఫండ్స్ భారత్‌లో జరిపిన కేటాయింపులు 2015 జనవరిలో గరిష్ఠంగా 5. 2 శాతం ఉండగా, 2016 జనవరి నాటికి 3.7 శాతానికి తగ్గిపోయాయి.