బిజినెస్

హెచ్1బిపై ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 13: హెచ్1బి వీసాపై యూఎస్‌లో ఉద్యోగాలు సంపాదించుకున్న ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పని చేసుకోవచ్చని యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది. నాన్-ఇమ్మిగ్రాంట్ కోటా కిందకు వచ్చే హెచ్1బి వీసా ద్వారా ప్రత్యేకమైన వృత్తి నిపుణులు, సాంకేతిక నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకోవడం తెలిసిందే. ఈ వీసా ఆధారంగానే యూఎస్‌లోని ఐటీ కంపెనీలు ఇండియా, చైనాల నుంచి పెద్దఎత్తున సాంకేతిక నిపుణులను నియమించుకుంటున్నాయి. ‘సాధారణంగా, హెచ్ 1బి వీసాలపై వస్తున్న వృత్తి, సాంకేతిక నిపుణులు యూఎస్‌లో ఒకటికంటే ఎక్కువ కంపెనీల్లో పని చేసుకునే వెసులుబాటు ఉంది. కాకపోతే, ప్రతి ఉద్యోగానికీ ఎల్-129 అనుమతి తప్పనిసరి’ అని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) తన ట్వీట్‌లో స్పష్టం చేసింది. ‘కొత్త ఉద్యోగి ఎవ్వరైనా ఎల్-129 పిటిషన్‌ను తప్పనిసరిగా పొందుపర్చాలి’ అని యుఎస్‌సిఐఎస్ పేర్కొంది. అయితే, హెచ్1బి వీసా ఉన్న ఉద్యోగులు యూఎస్ కంపెనీల్లో ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలు చేసుకోవచ్చన్న నిబంధన కొత్తదేమీ కాదని, అయితే దీని గురించి చాలామందికి తెలీదని సిఐఎస్ అధికారులు చెబుతున్నారు. హెచ్1బి వీసాలను ఏడాదికి కేవలం 65వేలు మాత్రమే అమెరికా అనుమతిస్తుంది. మొదటి 20 వేల వీసాలను యూఎస్‌లో మాస్టర్స్ డిగ్రీ అంతకంటే ఉన్నత చదువులు చదువుకునే వాళ్లకు ఇవ్వాలన్న నిబంధననూ పెట్టుకుంది. అయితే, ప్రభుత్వ కేంద్రాల్లో అధ్యయనాలు, లాభాపేక్షలేని వివిధ కేంద్రాల్లో అధ్యయనాలకు వెళ్లే వాళ్లకు హెచ్1బి కోటాతో సంబంధం లేకుండానే వీసాలు జారీ చేస్తుండటం తెలిసిందే. అలాగే గ్రీన్‌కార్డు హోదా ఉన్న కుటుంబాలకూ హెచ్1బి కోటాతో సంబంధం లేకుండా వీసాలు తీసుకునే సౌలభ్యం ఉంది.