బిజినెస్

5.87 లక్షల క్వింటాళ్ల లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: రాష్ట్రంలో రైతులకు 2017-18 సంవత్సరానికి సంబంధించి 5.87 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. బుధవారం ఇక్కడి ఫ్యాప్సీ భవనంలో జరిగిన తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ రెండో సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు నాణ్యమైన విత్తనం కీలక భూమిక పోషిస్తుందన్నారు. సీడ్స్ కార్పోరేషన్ సబ్సిడీలపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నించాలని సూచించారు. రాష్ట్రంలో విత్తనాలకు సంబంధించి వౌలిక వసతులను కల్పిస్తున్నామని గోదాములను నిర్మిస్తున్నామన్నారు. విత్తనోత్పత్తి జరిగే భూముల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో రైతుల అవసరాల కోసం 2015-16 లో వరి, మొక్కజొన్న, పల్లి, అపరాలు, సోయాబీన్, పచ్చిరొట్ట తదితరాలకు సంబంధించి 5,24 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేశామని ఈ కార్పోరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. కార్పోరేషన్ పనితీరుపై సమగ్ర నివేదికను సమర్పించారు.