బిజినెస్

స్టాక్ మార్కెట్లు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృద్ధి రేటు అంచనాలను ఏడీబీ తగ్గించడంతో పడిపోయిన సూచీలు
175 పాయింట్లు తగ్గిన సెనె్సక్స్ * 10,200 దిగువకు దిగజారిని నిఫ్టీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తూ విడుదల చేసిన గణాంకాలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సూక్ష్మ గణాంకాలు బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ రెండూ కూడా నష్టాలతో ముగిశాయి. సెనె్సక్స్ 174.95 పాయింట్లు (0.53 శాతం) దిగజారి 33,053.04 పాయింట్ల వద్ద ముగిసింది. డిసెంబర్ 7వ తేదీన కూడా ఈ సూచీ ఇదే స్థాయి వద్ద ముగియడం విశేషం. సెనె్సక్స్ మంగళవారం కూడా 228 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ బుధవారం 10,200 పాయింట్ల స్థాయికన్నా దిగువకు పడిపోయింది. 47.20 పాయింట్లు (0.46 శాతం) దిగజారిన నిఫ్టీ చివరకు 10,192.95 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ 10,169.85- 10,296.55 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు (డీఐఐలు) మంగళవారం నికరంగా రూ. 853.67 కోట్ల విలువ గల షేర్లను విక్రయించగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 843.20 కోట్ల విలువ గల షేర్లను కొనుగోలు చేశారు. బుధవారం సెనె్సక్స్ ప్యాక్‌లోని షేర్లలో సిప్లా అత్యధికంగా 2.13 శాతం నష్టపోయింది. అదాని పోర్ట్స్ తరువాత స్థానాన్ని ఆక్రమించింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కంపెనీలకు చెందిన షేర్ల ధరలు కూడా పడిపోయాయి. కోటక్ బ్యాంక్, టీసీఎస్, ఒఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి.