బిజినెస్

జీడీపీ వృద్ధి అంచనా 6.7శాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త జీఎస్‌టీ కారణంగా కంపెనీలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున 2018 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు త్రైమాసికాలలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పెరుగుతుందని ఏడీబీ తన ఆసియన్ డెవలప్‌మెంట్ ఔట్‌లుక్ సప్లిమెంట్‌లో పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కార్యక్రమం ద్వారా వాటి బ్యాలెన్స్ షీట్లను మెరుగు పరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడతాయని ఏడీబీ పేర్కొంది.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఈ ఆర్థిక సంవత్సర దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఏడు శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించింది. నిరుడు నవంబర్‌లో చేసిన పెద్ద నోట్ల రద్దు, ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలులో ఎదురవుతున్న సవాళ్లు, వ్యవసాయానికి వాతావరణ సంబంధమైన ముప్పుల కారణంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను తగ్గించినట్లు ఏడీబీ బుధవారం వెల్లడించింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19) దేశ జీడీపీ అంచనాను కూడా ఏడీబీ 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. జీడీపీ వరుసగా అయిదు త్రైమాసికాలు పడిపోయి, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో తిరిగి పుంజుకొని 6.3 శాతానికి పెరిగిన కొన్ని వారాలకే ఏడీబీ భారత జీడీపీ అంచనాలను తగ్గించింది. కొత్త జీఎస్‌టీ కారణంగా కంపెనీలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున 2018 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు త్రైమాసికాలలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పెరుగుతుందని ఏడీబీ తన ఆసియన్ డెవలప్‌మెంట్ ఔట్‌లుక్ సప్లిమెంట్‌లో పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కార్యక్రమం ద్వారా వాటి బ్యాలెన్స్ షీట్లను మెరుగు పరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడతాయని ఏడీబీ పేర్కొంది. అయితే నిరుడు నవంబర్‌లో చేసిన పెద్ద నోట్ల రద్దు, ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్‌టీ అమలులో ఎదురవుతున్న సవాళ్లు, ఈ సంవత్సరం అకాల వర్షాలు వంటివి వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో వృద్ధి రేటు తగ్గిందని, అందువల్ల ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీని తగ్గించడం జరిగిందని ఏడీబీ వివరించింది. 2018లో ముడి చమురు ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి ఉంటుందని, ప్రైవేటు పెట్టుబడుల వృద్ధి కూడా తగినంతగా ఉండబోదని, అందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాను తగ్గించినట్లు ఏడీబీ వివరించింది. ఆహార వస్తువుల ధరలు తక్కువగా ఉండటంతో పాటు పెద్ద నోట్లను రద్దు చేసిన కారణంగా తగినంతగా డిమాండ్ పెరగక పోవడం వల్ల భారత్‌లో 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో ద్రవ్యోల్బణం తక్కువగానే ఉందని, సగటున 2.7 శాతం చొప్పున నమోదయిందని ఏడీబీ తెలిపింది. అయితే జూలై నుంచి ఆహార వస్తువులు ప్రత్యేకించి పప్పు ధాన్యాలు, కూరగాయల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరగడం ప్రారంభం అయిందని ఏడీబీ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగిన కారణంగా దేశంలో ఇంధన ధరలు పెరగడం కూడా ఈ ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమయిందని ఏడీబీ విశే్లషించింది. ఈ ఆర్థిక సంవత్సరం రానున్న నెలల్లో కూడా ఇంధన ధరలు పెరుగుతాయని ఏడీబీ అంచనా వేసింది. భారత్‌లో 2017-18 ఆర్థిక సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం అంచనాను ఏడీబీ 3.7 శాతానికి తగ్గించింది. ఏడీబీ గతంలో వేసిన అంచనా 4 శాతం కన్నా ఇది స్వల్పంగా తక్కువ.
ఏడీబీ కన్నా ముందు ప్రపంచ బ్యాంకు కూడా 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి అంచనాను 7.2 శాతం నుంచి ఏడు శాతానికి తగ్గించింది. ప్రపంచ బ్యాంకు కూడా నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలునే కారణాలుగా చూపింది. అయితే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.4 శాతం సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.