బిజినెస్

ఇక ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒసాకా, జూన్ 2: వృద్ధి రేటును వేగవంతం చేయడానికి ప్రభుత్వం తన సంస్కరణల అజెండాను వేగవంతం చేసిందని, ఫలితంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ అతి కొద్ది సంవత్సరాల్లోనే రెట్టింపు అయి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం అన్నారు. ఈ సంస్కరణలు భారత దేశం శరవేగంగా అభివృద్ధి చెందిన భారీ ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని నిలుపుకోవడానికే కాక అభివృద్ధి చెందుతున్న వ్యవస్థస్థాయినుంచి మరింతగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ దివగా ముందుకు సాగడానికి తోడ్పడుతాయని ఆయన చెప్పారు. ‘్భరత దేశ ఆర్థిక వ్యవస్థ చాలావేగంగా అభివృద్ధి చెందుతున్నందున రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే మరో లక్ష కోట్లడాలర్లు మా ఆర్థిక వ్యవస్థకు చేరబోతున్నాయి. మేము 2,3 లక్షల కోట్ల డాలర్ల స్థాయినుంచి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి మరి కొద్ది సంవత్సరాలు చాలు. దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా విస్తరించబోతోందో చెప్పడానికి అది ఒక సంకేతం మాత్రమే’నని జైట్లీ అన్నారు. ప్రపంచం అంతా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎదగడం చాలా సులభం. అయితే అంతర్జాతీయ వాతావరణం ఏమాత్రం ఊతమిచ్చేదిగా లేనప్పుడు, ఎదగడం నిజమైన సవాలని సిఐఐ, డిఐపిపి ఏర్పాటు చేసిన భారత పెట్టుబడుల ప్రోత్సాహక సెమినార్‌లో మాట్లాడుతూ జైట్లీ అన్నారు.