బిజినెస్

దక్షిణ మధ్య రైల్వేకు రెండు జాతీయ విద్యుత్ పొదుపు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ద్వారా దక్షిణ మధ్య రైల్వే రెండు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులు స్వీకరించింది. ఈ అవార్డులు ఇంధన పరిరక్షణ విభాగంలో 2017లో సాధించిన విజయాలకు గుర్తింపుగా లభించాయి. న్యూఢిల్లీ విజ్ఞాన భవన్‌లో ఈ అవార్డులను దక్షిణ మధ్య రైల్వే జీఎం స్వీకరించారు. ఆఫీస్ అండ్ బిపీఓ బిల్డింగ్‌లు (సాలీనా 10 లక్షల కిలోవాట్ల పైగా) విభాగంలో సికిందరాబాద్ డివిజనల్ రైల్వే కార్యాలయం, సంచాలన్ భవన్‌కి రెండవ బహుమతి, ఆఫీస్ అండ్ బీపీఓ బిల్డింగుల్లో (సాలీనా 10 లక్షల కిలోవాట్ల పైన) విభాగంలో సికిందరాబాద్ రైల్వే స్టేషన్ భవనానికి సర్ట్ఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది. ఈ అవార్డులను దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్, సికిందరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అమిత్ వరదాస్ స్వీకరించారు. ఏటా 8.2 లక్ష ల యూనిట్ల ఇంధనం పొదుపు చేసి సంవత్సరానికి రూ. 67 లక్షలు ఆదా చేసినందుకు ఈ అవార్డులు దక్కడం ముదావహమని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. రైల్వే అధికారులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఈ అవార్డులు దక్కాయని జీఎం తెలిపారు.

చిత్రం..న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో అవార్డును స్వీకరిస్తున్న జీఎం వినోద్‌కుమార్