బిజినెస్

చివరలో కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 14: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ విజయం సాధిస్తుందనే ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి. గురువారం తొలుత నష్టాల బాట పట్టిన మార్కెట్లు ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు వెలువడిన తరువాత మదుపరులు ఉత్సాహంతో కొనుగోళ్లకు పూనుకోవడంతో పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ- రెండూ కూడా పైకి ఎగబాకాయి. సెనె్సక్స్ 194 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 10,250 పాయింట్ల స్థాయికన్నా పైన ముగిసింది. సెనె్సక్స్ గురువారం సెషన్‌లో చివరి గంటలో వేగంగా ఎగిసి 33, 321.52 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 193.66 పాయింట్ల (0.59 శాతం) లాభంతో 33,246.70 పాయింట్ల వద్ద ముగిసింది. సూక్ష్మ ఆర్థిక గణాంకాలు, ఆసి యా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను తగ్గించడం మదుపరులను నిరుత్సాహపరచడంతో క్రితం రెండు సెషన్లలో కలిపి సెనె్సక్స్ 402.75 పాయింట్లు నష్టపోయిన విషయం విదితమే. 50 షేర్లతో కూడిన నిఫ్టీ గురువారం 59.15 పాయింట్లు (0.58శాతం) పుంజుకొని, 10,252.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముం దు ఇంట్రా-డేలో ఈ సూచీ 10,276.10- 10,141.55 పాయింట్ల మధ్య కదలాడింది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెలలో 3.93 శాతం పెరగడంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తూనే కొనుగోళ్లకు పూనుకున్నారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని కంపెనీలలో డాక్టర్ రెడ్డీస్ కంపెనీ షేర్లు అత్యధికంగా 2.34 శాతం లాభపడ్డాయి. సిప్లా రెండో స్థానాన్ని ఆక్రమించింది. షేర్ల ధరలు పెరిగిన కంపెనీలలో ఐటీసీ, ఎంఅండ్‌ఎం, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, లుపిన్, కోటక్ బ్యాంక్ ఉన్నాయి. గురువారం నష్టపోయిన కంపెనీలలో టీసీఎస్ షేర్ ధర అత్యధికంగా 2.62 శాతం పడిపోయింది. సన్ ఫార్మా తరువాత స్థానాన్ని ఆక్రమించింది. పవర్ గ్రిడ్, ఎల్‌అండ్‌టీ కూడా నష్టపోయాయి.