బిజినెస్

వృద్ధికి వెనె్నముక విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, దేశాభివృద్ధికి సమర్థవంతమైన, నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండటం అనేది ఎంతో కీలకమని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. భారత్ గత మూడేళ్లుగా అవసరమైన దానికన్నా ఎక్కువ విద్యుత్ (మిగులు విద్యుత్)ను ఉత్పత్తి చేయడంలో విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన అవసరాలు ఖచ్చితంగా పెరుగుతాయని, అందువల్ల మిగులు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించవలసిందేనని అన్నారు. వ్యవసాయానికి నీరు ఎంత అవసరమో, పరిశ్రమలకు విద్యుత్ అంతే అవసరమని ఆయన పేర్కొన్నారు.
‘సమర్థవంతమైన విద్యుత్ అందుబాటులో ఉండటం అనేది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, దేశాభివృద్ధికి వెనె్నముక వంటిది’ అని ఆయన అన్నారు. ‘విద్యుత్‌కు సంబంధించి ఒకటి కాదు, అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. విద్యుత్ అందుబాటులో ఉండటం, విద్యుత్ వనరులు రక్షణీయంగా ఉండటం, విద్యుత్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వంటి సవాళ్లు మన ముందు ఉన్నాయి. అందరికీ రోజూ 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలన్న తన హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నందున ఈ సవాళ్లన్నీ ఎంతో ముఖ్యమైనవి’ అని రాష్టప్రతి అన్నారు. భవనాలలో విద్యుత్ సంరక్షణకు ఉద్దేశించిన ఒక వెబ్ పోర్టల్‌ను రాష్టప్రతి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇంధన సంరక్షణ, ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అనేవి మన లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. ఈ రెండూ కూడా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదలకే కాకుండా, ఎక్కువ మంది వినియోగదారులకు విద్యుత్‌ను అందుబాటులోకి తేవడానికి, తక్కువ ధరకు విద్యుత్‌ను అందించడానికి తోడ్పడతాయని ఆయన వివరించారు.