బిజినెస్

రెండోరోజూ కొనుగోళ్ల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 15: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీకి అనుకూలంగా రావడం శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా రెండో రోజు పుంజుకుంది. ఈ సూచీ శుక్రవారం 216 పాయింట్లు పెరిగింది. రెండు రాష్ట్రాల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని సర్వేలు వెల్లడించడంతో శుక్రవారం సెనె్సక్స్ అధిక స్థాయిల వద్ద ప్రారంభం అయింది. అయితే ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడాలని, అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలని మదుపరులు నిర్ణయించుకోవడంతో తరువాత మార్కెట్‌లో జోరు తగ్గింది. ఈ నెల 18న మార్కెట్లు పనిచేసే సమయంలోనే ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. శుక్రవారం ఇంట్రా-డేలో సెనె్సక్స్ 33,621.96 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే చివరకు 216.27 పాయింట్ల (0.65 శాతం) లాభంతో 33,462.97 పాయింట్ల వద్ద ముగిసింది. 50 షేర్లతో కూడిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ శుక్రవారం 81.15 పాయింట్లు (0.79 శాతం) పుంజుకొని 10,333.25 పాయింట్ల వద్ద ముగిసింది. రూపాయి బలపడటం కూడా మార్కెట్లు పుంజుకోవడానికి దోహదపడింది. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మూడు నెలల గరిష్ఠ స్థాయికి పెరిగింది. ఇదిలా ఉండగా, వరుసగా రెండో వారం సెనె్సక్స్ పైకి ఎగబాకింది. ఈ వారం మొత్తం మీద చూస్తే ఈ సూచీ 212.67 పాయింట్లు (0.63 శాతం) పెరిగింది. నిఫ్టీ కూడా ఈ వారంలో 67.60 పాయింట్లు (0.65 శాతం) పుంజుకుంది. మదుపరులు బాగా కొనుగోళ్లు జరపడంతో మెటల్, రియాల్టీ, కన్జ్యూమర్ డ్యూరేబుల్స్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్ల ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్పారు. వరుసగా రెండు రోజులు- గురు, శుక్రవారాల్లో కలిపి సెనె్సక్స్ 410 పాయింట్లు పుంజుకోగా, నిఫ్టీ 140కి పైగా పాయింట్లు పెరిగింది. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశం శనివారం జరుగనుండటంతో మదుపరులు శుక్రవారం ఉత్సాహంగా లావాదేవీల్లో పాల్గొన్నారు. మెటల్, రియాల్టీ రంగాల షేర్లలో వచ్చిన ర్యాలీ నేతృత్వంలో అన్ని రంగాల సూచీలు శుక్రవారం పుంజుకున్నాయి. మెటల్, రియాల్టీ రంగాల సూచీలు 2.82 శాతం వరకు పెరిగాయి. విదేశీ ఫండ్‌లు గురువారం నికరంగా రూ. 232.17 కోట్ల విలువ గల షేర్లను కొనుగోలు చేశాయన్న గణాంకాలు కూడా శుక్రవారం మార్కెట్లలో కొనుగోళ్లు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. మెటల్ సూచీ గరిష్ఠంగా 2.82 శాతం పుంజుకోగా, రియాల్టీ, కన్జ్యూమర్ డ్యూరేబుల్స్, ఆటో రంగాలు తరువాత స్థానాలను ఆక్రమించాయి. శుక్రవారం లావాదేవీల సెంటిమెంట్ బలపడటంతో బీఎస్‌ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.38 శాతం, ఒక శాతం చొప్పున పెరిగాయి.