బిజినెస్

ఆర్టీసీలో ఇక బీ-ఎస్ 4 బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాలను అధిగమించే దిశగా చర్యలు చేపడుతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపే లక్ష్యంగా సంస్థలో బీఎస్-4 (భారత్ స్టేజ్-4) బస్సులను వినియోగిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బస్సులను వినియోగం ద్వారా సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు దోహదపడుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. నల్లగొండ రీజియన్‌కు 84 బీఎస్ - 4 బస్సులను కేటాయించారు. రీజియన్ పరిధిలోని 7 డిపోలకు ఈ బస్సులను కేటాయించారు. సూర్యాపేట డిపోకు 12, కోదాడ డిపోకు 9, యాదగిరిగుట్ట డిపోకు 21, నల్లగొండ డిపోకు 5, దేవరకొండ డిపోకు 9, నార్కెట్‌పల్లి డిపోకు 3, మిర్యాలగూడ డిపోకు 24 చొప్పున బస్సులను కేటాయించారు. రీజియన్ పరిధిలో 7 డిపోలు ఉండగా అందులో నల్లగొండ డీవీఎం పరిధిలోని ఒక్క మిర్యాలగూడ డిపోకే 5 రాజధాని (ఇంద్ర) బస్సులను కేటాయించారు. ఈ బస్సులను ఆ డిపో నుండి హైదరాబాద్, తిరుపతి, షిరిఆ్పలకు నడుపుతున్నారు. మొత్తం రీజియన్‌కు 84 బస్సులు రాగా అందులో 5 రాజధాని, 34 సూపర్‌లగ్జరీ, 28 ఎక్స్‌ప్రెస్, 17 మినీపల్లె వెలుగు బస్సులు వచ్చాయి. కొనేళ్లుగా పనిచేయని, పాత బస్సుల స్థానంలో ఈ బస్సులను కొనుగోలు చేసి నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
బీఎస్ -4 బస్సుల ప్రత్యేకతలు
ఆర్టీసీలో కొత్తగా ప్రవేశపెట్టిన ఈబస్సుల్లో 165 హెచ్‌పీ సామర్ధ్యం గల ఇంజన్‌ను ఉపయోగించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడం వల్ల డ్రైవర్లు అత్యంత సులువుగా వీటిని నడిపించే వీలుంటుంది. ఈ బస్సుల్లో స్టీరింగ్, ఎక్స్‌లేటర్ మొదలు చక్రాల వరకు మొత్తం 12 సెన్సార్లతో వ్యవస్థ పనిచేస్తుంది. బస్సువేగం, ఇంధన వాడకంపై ఈ విధానం ప్రభావితం చేస్తుంది. బస్సు వేగాన్ని బట్టి ఇంధనం ఉపయోగపడేలా ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ఈసీయు) పనిచేస్తుంది. ఇంధన పొదుపులో పాత బస్సులకు, వీటికి వ్యత్యాసం ఉంటుంది. పాత బస్సులు లీటర్‌కు 4 నుండి 5 కిలోమీటర్లు నడవగా కొత్తబస్సులు ఆరు కిలోమీటర్లకు పైగానే నడుస్తున్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు. యాంటీలాగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండడంతో సడన్ బ్రేక్ వేసిన వాహనం కుదుపులకు లోనుకాకుండా వెంటనే ఆగిపోతుంది. బస్సులో సాంకేతిక లోపాలు ఏమైనా ఏర్పడితే స్కాన్ టూల్ పరికరం ద్వారా వెంటనే పసిగట్టే వీలుంటుంది. ఈ బీఎస్ - 4 బస్సు వేగాన్ని 80 కిలోమీటర్ల వరకు పరిమితం చేయడంతో ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది.
పర్యావరణానికి మేలు
బీఎస్ -4 బస్సులతో ప్రయాణికులకు భద్రత అధికమవుతుందని ఆర్టీసీ మెకానికల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పాటు ఇంధనం పొదుపు, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కాలుష్యం తగ్గడంతో పాటు మైలేజీ పెరగడం వల్ల సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ఈబస్సుల్లో ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ (ఈజీఆర్) విధానాన్ని అమలులోకి తెచ్చారు. అందువల్ల బస్సు నడిచే సమయంలో ఇంజన్‌లో వచ్చే వేడిగాలి సైతం చల్లబడుతుంది. ఈ గాలి మళ్లీ ఇంజన్‌లోకి వెళ్లి కార్బన్‌మోనాక్సైడ్‌ను తగ్గించి గొట్టం ద్వారా బయటకు పంపిస్తుంది. పాత బస్సుల్లో ఇంజన్‌ల ద్వారా పొగ 4.5 శాతం గాలిలో కలిసేది. బీఎస్ -4 బస్సుల వినియోగం వల్ల 1.5 శాతం మాత్రమే పొగవెలువడుతుంది. ఆర్టీసీలో కాలంతీరిన పాత బస్సులన్నీంటిని తొలగిస్తున్నారు. 12 లక్షల కిలోమీటర్లకు పైబడి తిరిగిన బస్సులన్నీంటిని తీసివేసి వాటి స్థానంలో కొత్తగా బీఎస్ - బస్సులను కొనుగోలు చేస్తున్నారు.

చిత్రం..సూర్యాపేట డిపోకు కొత్తగా వచ్చిన బీఎస్-4 ఎక్స్‌ప్రెస్ బస్సు