బిజినెస్

బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి భానుడి దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 2: సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి ప్రచండభానుడి ప్రతాపంతో ఆటంకం ఏర్పడింది. ఏప్రిల్, మే రెండుమాసాలలో 90శాతం ఉత్పాదకరేటును మాత్రమే సంస్థ సాధించగలిగింది. రెండుమాసాలలో ఒకకోటి 4లక్షల 28వేల టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 93లక్షల 49వేల 605 టన్నులు సాధించి 90శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11ఏరియాలలో కేవలం 2ఏరియాలు మాత్రమే ఉత్పత్తి లక్ష్యాలను సాధించగలిగాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎండతీవ్రత ఉండడంతో కార్మికుల గైర్హాజరుతో పాటు ఉత్పత్తికి కీలకంగా ఉండే ఓపెన్‌కాస్టులలో సైతం ఈసారి బొగ్గు ఉత్పత్తి మందగించింది. ఏరియాల వారీగా సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం ఏరియా రెండుమాసాల ఉత్పత్తి లక్ష్యం 14లక్షల 98వేల 200 టన్నులు కాగా 13లక్షల 63వేల 939టన్నులు సాధించి 91శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకుంది. ఇల్లెందు ఏరియా 5లక్షల 37వేల లక్ష్యానికి 5లక్షల 26వేల 825టన్నులు సాధించి 98శాతం, మణుగూరు ఏరియా 15లక్షల టన్నులకు 13లక్షల 26వేల 957టన్నులు సాధించి 88శాతం, రామగుండం-1 ఏరియా 10లక్షల 99వేల టన్నులకు 9లక్షల 34వేల 87టన్నులు సాధించి 85శాతం, రామగుండం-2 ఏరియా 11లక్షల 59వేల 400టన్నులకు 9లక్షల 79వేల 834టన్నులు సాధించి 85శాతం, రామగుండం-3 ఏరియా 10లక్షల 70వేల టన్నులకు 10లక్షల 70వేల 359టన్నులు సాధించి 100శాతం, భూపాలపల్లి ఏరియా 6లక్షల 3వేల 800టన్నులకు 5లక్షల 73వేల 793టన్నులు సాధించి 95శాతం, ఆడ్రియాల ప్రాజెక్టు 6లక్షల 27వేల టన్నులకు 4లక్షల 85వేల 730టన్నులు సాధించి 77శాతం, బెల్లంపల్లి ఏరియా 10లక్షల 36వేల టన్నులకు 9లక్షల 61వేల 745టన్నులు సాధించి 93శాతం, మందమర్రి ఏరియా 5లక్షల 31వేల 600టన్నులకు 3లక్షల 9వేల 776టన్నులు సాధించి 58శాతం, శ్రీరాంపూర్ ఏరియా 7లక్షల 66వేల టన్నుల లక్ష్యానికి 8లక్షల 16వేల 562టన్నులు సాధించి 107శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకున్నాయి. మొత్తంగా రెండుమాసాల కాలంలో భూగర్భగనుల ఉత్పత్తి లక్ష్యం 28లక్షల 24వేల 200టన్నులు కాగా 18లక్షల ఒకవెయ్యి 758టన్నులు సాధించి 81శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకోగా బొగ్గు ఉత్పత్తిలో అత్యంత కీలకపాత్ర పోషించే ఓపెన్‌కాస్టు గనుల లక్ష్యం 82లక్షల 3వేల 800టన్నులు కాగా 75లక్షల 47వేల 847టన్నులు సాధించి 92శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకున్నాయి. మొత్తంగా ఓపెన్‌కాస్టుగనులు, భూగర్భగనులు కలిపి 90శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకున్నాయి. విపరీతంగా ఎండలు ఉండడంతో బొగ్గు ఉత్పత్తికి కొంత విఘాతం ఏర్పడిందని సింగేణి అధికారులు పేర్కొంటున్నారు.