బిజినెస్

33శాతానికి కుదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: రానున్న మూడేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూల)లోని తన వాటాను కేంద్ర ప్రభుత్వం 33 శాతానికి కుదించుకోవాలని సీఐఐ సూచించింది.
నిరర్ధక ఆస్తుల భారంతో కుంగిపోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదుకోవడానికి ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్ పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో సీఐఐ ఈ సూచన చేసింది. రానున్న రెండు నుంచి మూడు సంవత్సరాలలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని తన వాటాను 33 శాతానికి తగ్గించుకునే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని సీఐఐ సూచించింది. అయితే ప్రాథమిక రంగాల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెజారిటీ వాటాలను ఉంచుకోవచ్చని పేర్కొంది. అయితే ప్రభుత్వం ఓటింగ్ హక్కును తనవద్దే ఉంచుకోవడానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని వాటాలను ఈక్విటీ షేర్లుగా కాకుండా ప్రిఫరెన్స్ షేర్లుగా విక్రయించాలని సీఐఐ సూచించింది. ప్రభుత్వం తక్షణమే తన వాటాను 52 శాతానికి తగ్గించుకోవడానికి పబ్లిక్ ఇష్యూకు వెళ్లే అంశాన్ని పరిశీలించవచ్చని, రానున్న మూడేళ్లలో తన వాటాను 33 శాతానికి కుదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సీఐఐ ఒక ప్రకటనలో సూచించింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వం వాటా కనీసం 58 శాతం ఉంది. దీనిని ఇప్పుడు 52 శాతానికి తగ్గించాలని సీఐఐ సూచించింది.
అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికీ ప్రభుత్వం వాటా 80 శాతానికి పైగా ఉంది. కేవలం నాలుగు బ్యాంకుల్లోనే 2017 మార్చి నాటికి ప్రభుత్వ వాటా 58 శాతానికి తగ్గింది. ఇదిలా ఉండగా, బ్యాంకులకు సంబంధించిన ఖాతాల కొత్త ప్రమాణాలు 2018 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.