బిజినెస్

ఆందోళన వద్దు.. ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: మొండి బకాయిల సమస్యతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులకు బాసటగా నిలుస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం భరోసా ఇచ్చారు. నిరర్థక ఆస్తులు ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో గడచిన ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు నష్టాలపాలయ్యాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో దేశీయ బ్యాంకింగ్ రంగంలోనే గరిష్ఠంగా 5 వేల కోట్ల రూపాయలకుపైగా నష్టాలను చవిచూసింది. ఈ 12 బ్యాంకులు ఈ జనవరి-మార్చిలో 24 వేల కోట్ల రూపాయలకుపైగా నష్టపోవడం గమనార్హం. ఎస్‌బిఐసహా ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు గతంతో పోల్చితే తమ లాభాలను తగ్గించుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వరంగ బ్యాంకుల వ్యాపార తీరుపై ఇక్కడ జైట్లీ సమీక్ష నిర్వహించగా, అవసరమైతే బడ్జెట్‌లో ప్రతిపాదించిన సాయం కంటే అధికంగా నిధులను ప్రభుత్వ బ్యాంకులకు ఇస్తామని బ్యాంకర్లతో సమీక్ష అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల సాధికారతకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులకు 25,000 కోట్ల రూపాయల నిధులను అందిస్తామని బడ్జెట్ సందర్భంగా జైట్లీ ప్రకటించినది తెలిసిందే. అయితే మొండి బకాయిలతో ప్రభుత్వరంగ బ్యాంకర్లలో దెబ్బతిన్న ఆత్మస్థైర్యాన్ని పెంచేలా జైట్లీ తాజా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకర్ల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు ఐడిబిఐ బ్యాంక్ ఎండి కిశోర్ ఖారత్ చెప్పారు. కాగా, డెట్ రికవరీ లెజిస్లేషన్ సవరణలు, పరిశీలిన అంశాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని కూడా జైట్లీ ఈ సందర్భంగా చెప్పారు. బ్యాంకింగ్ రంగ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చ జరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకులను ఏకీకృతం చేయడానికి తమ ప్రభుత్వం మద్దతు పలుకుతుందన్న జైట్లీ.. ఎస్‌బిఐ దాని అనుబంధ బ్యాంకుల విలీనంపై స్పందిస్తూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. నిరర్థక ఆస్తులు అధికంగా ఉన్న ఉక్కు రంగంతోపాటు రహదారుల నిర్మాణ రంగంలో ఉదయ్ బాండ్ల పథకం విజయవంతం కావడంతో బ్యాంకులు కొంత ఉపశమనాన్ని పొందాయని అన్నారు.

చిత్రం బ్యాంకింగ్ సమీక్ష అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ