బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరపనున్న క్రమంలో మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరచలేకపోయారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 65.58 పాయింట్లు కోల్పోయి 26,777.45 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.75 పాయింట్లు పడిపోయి 8,201.05 వద్ద నిలిచింది. ఐటి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, చమురు, గ్యాస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిజానికి సూచీలు ఉదయం ఆరంభంలో లాభాల్లోనే కదలాడినప్పటికీ, సమ యం గడుస్తున్నకొద్దీ నష్టాల్లోకి జారుకున్నాయి. మెజారిటీ మదుపరులు మంగళవారం జరిపే ద్రవ్యసమీక్షలో ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతుందని అభిప్రాయానికి రావడం కూడా మార్కెట్లను నష్టపరిచి ఉండొచ్చని ట్రేడింగ్ విశే్లషకులు చెబుతున్నారు. ఇక ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది. జపాన్, చైనా సూచీలు నష్టపోగా, హాంకాంగ్ సూచీ లాభపడింది. ఐరోపా మార్కెట్లలోనూ మిశ్రమ ఫలితాలు చోటుచేసుకున్నాయి.
అంతంతమాత్రంగానే స్పందన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రుణ సెక్యూరిటీలకు సంబంధించి సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ).. విదేశీ మదుపరులకు నిర్వహించిన బాండ్ల వేలం నిరాశపరిచింది. సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఆన్‌లైన్‌లో జరిగిన ఈ వేలంలో 4,046 కోట్ల రూపాయల విలువైన బాండ్లను వేలానికి వేయగా, 4,011 కోట్ల రూపాయల విలువైన బిడ్లు మాత్రమే దాఖలయ్యాయి. నిజానికి ఇంతకుముందు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలలో జరిగిన బాండ్ల వేలాల్లో విదేశీ మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. అయితే ఈసారి మాత్రం ఆ స్థాయిలో కనిపించలేదు.