బిజినెస్

పొదుపు ఖాతాలపై 6 శాతం వడ్డీ ఇస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: పొదుపు ఖాతాలపై నానాటికీ వడ్డీ శాతం తగ్గిపోతున్న నేపథ్యంలో 6 శాతం వడ్డీకి కట్టుబడి ఉన్నామని దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో నాలుగో అతిపెద్ద బ్యాంకైన కొటక్ మహీంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది. తమ ఖాతాదారుల సేవింగ్స్ అకౌంట్లలో లక్ష రూపాయలకుపైగా ఉన్న నగదు నిల్వలకు ఏడాదికి 6 శాతం వడ్డీరేటును ఇస్తున్నామని, లక్ష రూపాయల వరకు ఉన్న నగదు నిల్వలకు 5 శాతం వడ్డీని అందిస్తున్నామని సోమవారం ఇక్కడ కొటక్ మహీంద్ర బ్యాంక్ శాఖాధిపతి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు విరాట్ దివాన్‌జీ తెలిపారు. నిజానికి చాలా బ్యాంకులు 4 శాతం వడ్డీరేటునే పొదుపు ఖాతాదారులకు ఇస్తున్నాయని చెప్పారు. ఇక సమాజంలోని బాలలు, మహిళలు, వృద్ధుల అవసరాల కోసం, వారికి ఆర్థిక చేయూతనిచ్చేలా పలు పథకాలను అందిస్తున్నామని వాటిని వినియోగించుకోవాలని బ్యాంక్ ఖాతాదారులకు ఈ సందర్భంగా దివాన్‌జీ సూచించారు.

చిత్రం విలేఖరులతో మాట్లాడుతున్న కొటక్ మహీంద్ర బ్యాంక్ శాఖాధిపతి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు విరాట్ దివాన్‌జీ