బిజినెస్

భారత్‌లో స్విట్జర్లాండ్లను నిర్మిస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, జూన్ 6: భారత్‌ను స్విట్జర్లాండ్‌ల సమూహంగా మార్చాలనుకుంటున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. తన స్విస్ పర్యటన సందర్భంగా సోమవారం మోదీ.. భారత్‌లో 2-3 స్విట్జర్లాండ్‌లను నిర్మించాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఇందులోభాగంగానే స్విస్ వ్యాపార, పారిశ్రామికవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్‌లో పెట్టుబడులను పెట్టాలని వారిని ఆహ్వానించారు. రైల్వేలు తదితర వౌలికరంగాలను అభివృద్ధి పరిచేందుకు సహకరించాలని, 50 నగరాల్లో మెట్రో రైళ్ల నిర్మాణం, 5 కోట్ల చౌక గృహాల నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే భారత్‌లో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్విస్ వ్యాపార, పారిశ్రామికవేత్తలకు మోదీ తెలియజేశారు. 175 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి తమ లక్ష్యమని పేర్కొన్నారు. ‘్భరత వౌలిక రంగంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలి. 50 నగరాల్లోనైనా మెట్రో రైళ్ల సేవలు అవసరం. 50 మిలియన్ల చౌక గృహాల నిర్మాణం జరగాల్సి ఉంది. ముఖ్యంగా రైల్వే నెట్‌వర్క్ విస్తరణ వేగంగా జరగాలి. టెక్నాలజీ పెరగాలి.’ అన్నారు. ఇక వాతావరణ మార్పులు, పర్యావరణ రక్షణ దృష్ట్యా సౌరశక్తి ఆధారంగా విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే 175 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే సౌర విద్యుదుత్పత్తికి సంబంధించిన పరికరాల తయారీదారులు భారత్‌కు రావాలని కోరారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య అసోసియేషన్‌కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎబిబి, లఫర్జ్, నోవార్టీస్, నెస్లే, రీటర్, రోచ్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, వాచీల తయారీకి స్విట్టర్లాండ్ పేరొందిన నేపథ్యంలో అక్కడి వాచీ తయారీ సంస్థలను గుజరాత్ నుంచి వజ్రాలను సేకరించి వాటిని వాచీల తయారీకి వినియోగించుకోవాలని ఆహ్వానించారు. ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుందని హామీనిచ్చారు. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన వ్యాపార నిర్వహణ సులభతర దేశాల జాబితాలో భారత్ స్థానం మెరుగైన విషయాన్ని గుర్తుచేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యానికి సహకరించాలని ఈ సందర్భంగా స్విస్ వ్యాపార, పారిశ్రామికవేత్తలకు సూచించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ తదితర కార్యక్రమాలను వివరించారు. ఈ క్రమంలోనే ‘నా దేశంలో రెండు లేదా మూడు స్విట్జర్లాండ్‌లను సృష్టించడం నాకు అవసరం’ అని అన్నారు. స్విస్ తరహా నైపుణ్య అభివృద్ధి భారత్‌కు చాలా అవసరమన్నారు. భారత్‌ను కేవలం 125 కోట్ల జనాభా కలిగిన మార్కెట్‌గానే చూడొద్దన్న మోదీ ఇక్కడి యువత నైపుణ్యం, ప్రభుత్వ పాలనను కూడా దృష్టి పెట్టుకోవాలని సూచించారు. భారత్‌లో 35 సంవత్సరాలలోపు వయసున్నవారు 80 కోట్ల మంది ఉన్నారని, బలమైన శ్రామికశక్తి భారత్ సొంతమని చెప్పారు. ఇకపోతే బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత కోసం జి20 దేశాలు తీర్మానించిన సమాచార మార్పిడికి భారత్ కట్టుబడి ఉందన్నారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం వివరాలను రాబట్టేందుకు భారత్ విశ్వప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మోదీ వ్యాఖ్యలు పరోక్షంగా స్విట్టర్లాండ్ తీరును విమర్శించినట్లైంది.
మరోవైపు ప్రతిపాదిత భారత్-ఇఎఫ్‌టిఎ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులను పునఃప్రారంభించేందుకు స్విట్జర్లాండ్ సీనియర్ అధికారులు భారత్‌కు రానున్నారు. ఈ వారంలో స్విస్ ప్రభుత్వ అధికారి మ్యారీ-గాబ్రిల్లే ఇనెచెన్-ఫ్లెష్ భారత్‌లో పర్యటించనున్నా రు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు నీడర్ అమ్మన్ మధ్య సోమవారం ఇక్కడ జరిగిన సమావేశం నేపథ్యంలో ఫ్లెష్ భారత పర్యటన ప్రకటన వచ్చింది. స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, లీచెన్‌స్టీన్ దేశాలతో కూడిన ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఇఎఫ్‌టిఎ)తో భారత్ ఈ స్వేచ్ఛా వాణిజ్య చర్చలు జరుపుతోంది.

చిత్రం సోమవారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో స్విస్ వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ, ఆ దేశాధ్యక్షుడు అమ్మన్