బిజినెస్

విశాఖలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 12: విశాఖ నగరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆది థ్యం ఇవ్వనుంది. భారత మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య (ఆలిప్ ఇండియా), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థ (ఎస్‌ఏడబ్ల్యూడీఎఫ్)లతో కలసి ఏపీ ప్రభుత్వం ఈ సదస్సును జనవరి 17 నుంచి 19 వర కూ మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ‘పారిశ్రామిక నవకల్పనలు, సాంకేతికోత్పత్తి, పారిశ్రామికీకరణ’ ప్రాధాన్యతాంశంగా అంతర్జాతీయ మహిళా సదస్సు జరుగుతుందన్నారు. మహిళల్లో పారిశ్రామికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ప్రక్రియలు, నూతన వ్యాపా ర, పెట్టుబడి, మార్కెటింగ్ అవకాశాలు, మహిళల ఆర్థికాభివృద్ధి తదితర అంశాలపై నిష్ణాతులతో సమావేశాలు, చర్చలు నిర్వహించనున్నట్టు తెలిపారు. వివిధ దేశాలకు చెందిన మహిళా పారిశ్రామిక వేత్తలతో పాటు సంస్థల ప్రతినిధులు, మేథావులు, సాంకేతిక నిపుణులు, ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు సాంకేతికత, విజ్ఞానం మార్పిడి, నూతన ఉత్పత్తుల తయారీ వంటి అంశాలపై సమగ్ర విశే్లషణ చేస్తారన్నారు. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న సాంకేతికతతో కూడిన ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈసదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని, దక్షిణాసియా దేశాల సమాఖ్య సెక్రటరీ జనరల్ అంజాద్ హుస్సేన్, కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అరుణ్‌కుమార్ పాండా హాజరవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే క్రమంలో అలిప్ ఇండియాకు విశాఖ జిల్లా ఆనందపురం మండ లం గిడిజాలలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించినట్టు తెలిపారు. పారిశ్రామిక ఉత్పత్తులు, జౌళి రంగ ఉత్పత్తులు, హస్తకళా ఉత్పత్తులను సార్క్ దేశాలకు విస్తరించుకోగలుగుతారని అలిప్ ఇండియా అధ్యక్షురాలు రమాదేవి పేర్కొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాసరావు