బిజినెస్

యాష్ టెక్నాలజీ ప్రతినిధులతో లోకేష్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 12: క్లౌడ్ సర్వీసెస్, డేటా అనలిటిక్స్‌లో వివిధ సేవలు అందిస్తున్న యాష్ టెక్నాలజీస్ ప్రతినిధులతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఐటి రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. డీటీపీ విధానం, ఇతర విధానాలు, రాయితీల గురించి వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి స్థానంలో ఉన్నామని, కియా, అపోలో, హెచ్‌సిఎల్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. దీనిపై స్పందించిన యాష్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు, ఏపీలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకుసుముఖత వ్యక్తం చేశారు. సంవత్సరంలో 1000 మం దికి, మూడు ఏళ్లలో 5000 మందికి ఉపాధి కల్పిస్తామని, కార్యాచరణ సిద్ధం చేసుకుని త్వరలో వస్తామని చెప్పారు.

చిత్రం..యాష్ టెక్నాలజీ ప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి లోకేష్