బిజినెస్

ఇన్ఫోసిస్ లాభం 38శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 12: దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ ఎగుమతిదారు ఇన్ఫోసిస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 38.3 శాతం పెరిగింది. కంపెనీ 2017-18 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రూ. 5,129 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 3,708 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఇన్ఫోసిస్ ఐఎఫ్‌ఆర్‌ఎస్ అకౌంటింగ్ నియమావళి ప్రకారం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)కి సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.
అయితే మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే మాత్రం మూడు శాతమే పెరిగింది. 2017 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 17,794 కోట్లు. 2016 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 17,273 కోట్లు. ఇన్ఫోసిస్ అమ్మకాల వృద్ధి 2017-18 ఆర్థిక సంవత్సరంలో 5.5-6.5 శాతం మధ్య కొనసాగుతోంది. 2017 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అమెరికా పాలనాయంత్రాంగంతో అడ్వాన్స్ ప్రైసింగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. ఫలితంగా ఈ త్రైమాసికంలో ఆదాయపు పన్ను వ్యయం ప్రొవిజన్ కింద రూ. 1,432 కోట్లు తిరిగి వచ్చిందని, ఫలితంగా ఈ త్రైమాసికంలో నికర లాభం పెరిగినట్లు వెల్లడించింది. దీనివల్ల ఒక్కో షేర్‌పై ఆదాయం రూ. 6.29 చొప్పున పెరిగిందని వివరించింది. ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీగా సలీల్ పరేఖ్ ఈ నెల 2న బాధ్యతలు స్వీకరించిన తరువాత కంపెనీ త్రైమాసిక ఫలితాలు వెలువడటం ఇదే మొదటిసారి. పరేఖ్ నాయకత్వంలో ఇన్ఫోసిస్ ఇప్పుడు వ్యాపారాన్ని పెంచుకోవడంపైనా, ఆదాయ వృద్ధిపైనా కేంద్రీకరిస్తోంది. మూడో త్రైమాసికంలో తమ కంపెనీ పనితీరు పటిష్ఠంగా ఉందని, తాము ఇప్పుడు స్థిరత్వాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని, డిమాండ్ ఉన్న కొత్త రంగాలలో తమ క్లయింట్లకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పరేఖ్ పేర్కొన్నారు.