బిజినెస్

తగ్గిన కార్ల అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: దేశంలో గత నెల ప్యాసింజర్ కార్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది మే నెలలో దేశ వ్యాప్తంగా 1,60,371 ప్యాసింజర్ కార్ల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది మే నెలలో ఈ అమ్మకాలు 1,58,996 యూనిట్లకు తగ్గాయి. భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం (సియామ్) గరువారం విడుదల చేసిన తజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాల మందగమనం కొనసాగుతుండటం, సెడాన్ల కంటే ఇటీవల కొత్తగా మార్కెట్లోకి వచ్చిన యుటిలిటీ వాహనాల (యువిల) వైపు కొనుగోలుదారులు ఎక్కువగా మొగ్గు చూపుతుండటం ఇందుకు ప్రధాన కారణమని ‘సియామ్’ స్పష్టం చేసింది. ‘కొత్తగా మార్కెట్లోకి వచ్చిన హ్యుందాయ్ క్రెటా, మారుతీ వితారా బ్రీజా, మహీంద్ర టియువి-300, కెయువి-100 తదితర ఎస్‌యువిల (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్)వైపు కొనుగోలుదారులు ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో గత నెలలో కార్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కార్ల అమ్మకాలు నత్తనడకన కొనసాగుతుండటం, డీజిల్‌తో నడిచే వాహనాల కంటే పెట్రోల్‌తో నడిచే వాహనాల కొనుగోలుకు వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతుండటం కూడా ఇందుకు మరో కారణం’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ న్యూఢిల్లీలో విలేఖర్లకు వివరించారు. గత నెలలో దేశ వ్యాప్తంగా మొత్తం 2,31,640 ప్రయాణికుల వాహనాలు అమ్ముడు పోయాయని, గత ఏడాది మే నెలలో అమ్ముడు పోయిన 2,17,984 ప్రయాణికుల వాహనాల కంటే ఇది 6.26 శాతం ఎక్కువని ఆయన తెలిపారు.
ఇదిలావుంటే, దేశంలో గత నెల ద్విచక్ర వాహనాల అమ్మకాలు 9.75 పెరిగి 15,15,556 యూనిట్లకు చేరుకున్నాయి. 2015 మే నెలలో మొత్తం 9,53,311 మోటార్ సైకిళ్ల అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది మే నెలలో అవి 3.34 శాతం వృద్ధిచెంది 9,85,158 యూనిట్లకు పెరిగాయి. అయితే మోటార్ సైకిళ్ల అమ్మకాలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 16.24 శాతం వృద్ధి కంటే ఇది చాలా తక్కువని విష్ణు మాథుర్ తెలిపారు.