బిజినెస్

యాంఫిబియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రవేశ పెట్టేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, జనవరి 13: ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందిన యాంఫిబియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రవేశపెట్టేందుకు తగిన మార్గాలపై దృష్టిపెడుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోకగజపతిరాజు వెల్లడించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో రూ.60లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సహకార సంఘం నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేవలం మీటరు లోతు నీరు ఉండి 300 మీటర్లు వెడల్పు కాలువ ఉంటే యాంఫిబియన్ ఎయిర్‌క్రాఫ్ట్ దిగే అవకాశం ఉంటుందన్నారు. దేశంలో వేలాది నదులు, కాలువలు ఉన్నందున మరోపక్క పర్యాటకానికి ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. విమానయాన రంగం ప్రపంచంలో భారతదేశంలో మూడో స్థానంలో ఉందన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధికి ఎంతగానో సహకారం అందిస్తోందన్నారు. రాజమహేంద్రవరం, గన్నవరం విమానాశ్రయాల అభివృద్ధికి భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇచ్చిందని చెప్పారు. విమాన ప్రయాణీకుల సంఖ్య కూడా బాగా పెరుగుతోందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో విమానాశ్రయాల సంఖ్య కూడా బాగా పెరుగుతోందని చెప్పారు. సమావేశంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఏఎంసీ ఛైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, వైస్ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు, బ్యాంకు అధ్యక్షులు చింతలపాటి సత్యానంద శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు.